F3 Movie : ఎఫ్‌3 మూవీ స్టోరీ లీక్‌.. ఇదేనా.. ఆ 20 నిమిషాలు ప్రేక్ష‌కులు సీట్ల‌లో ఉండ‌లేర‌ట‌..!

May 25, 2022 4:55 PM

F3 Movie : అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రీన్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న మూవీ.. ఎఫ్3.. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్‌3 మూవీని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఎఫ్2 మూవీ అప్ప‌ట్లో ఘ‌న విజయం సాధించింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈ మూవీ ఏకంగా రూ.130 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు ఎఫ్‌3 మూవీపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఎఫ్2 క‌న్నా ఎఫ్3 మూవీ మ‌రింత వినోదాన్ని పంచుతుంద‌ని.. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఎఫ్3 మూవీకి చెందిన క‌థ అని ఓ స్టోరీ మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇక దాని వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

ఎఫ్2 లోలాగే ఎఫ్3 మూవీలోనూ భర్త‌ల‌ను డ‌బ్బు కోసం హింసించే భార్య‌ల క‌థ‌ను చూపించ‌నున్నారు. అయితే ఈ మూవీలో మొద‌టి పార్ట్‌లో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ డ‌బ్బు సంపాదించ‌డం కోసం ప‌డే క‌ష్టాల‌ను చూపించార‌ట‌. వారు హోట‌ల్ బిజినెస్‌తోపాటు ప‌లు ర‌కాల బిజినెస్‌ల‌ను పెట్టి న‌ష్ట‌పోతార‌ట‌. దీంతోపాటు డ‌బ్బు కోసం భార్య‌ల పోరు కూడా ఎక్కువ‌వుతుంది. అయితే సెకండాఫ్‌లో ఒక 20 నిమిషాల పాటు ఔట్ అండ్ ఔట్ కామెడీ ఉంటుంద‌ట‌. ఓ స‌మ‌యంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రూ గుప్త నిధి త‌వ్వేందుకు వెళతార‌ట‌. కానీ వెంక‌టేష్‌కు రేచీక‌టి కార‌ణంగా క‌న‌బ‌డ‌దు. వ‌రుణ్ తేజ్‌కు న‌త్తి ఉంటుంది. ఇక ఈ ఇద్ద‌రూ రాత్రి నిధుల‌ను త‌వ్వేందుకు వెళతార‌ట‌. అయితే అదే స‌మ‌యంలో ఇంకో బ్యాచ్ కూడా అక్క‌డికి నిధుల‌ను త‌వ్వేందుకు వ‌స్తార‌ట‌. దీంతో వెంకీ, వ‌రుణ్ ల‌ను చూసి వారు దెయ్యాల‌ని అనుకుంటార‌ట‌. ఇలా సెకండాఫ్‌లో ఒక 20 నిమిషాల పాటు అద్భుత‌మైన కామెడీ ఉంటుంద‌ట‌. అలా అని చెప్పి ఓ స్టోరీ మాత్రం లీకైంది. ప్ర‌స్తుతానికి ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న స్టోరీయే. అయితే సినిమాలో క‌థ కూడా ఇలాగే ఉంటుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

F3 Movie story leaked online this may be success
F3 Movie

ఇక ఈ మూవీలో సునీల్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, సోనాల్ చౌహాన్‌లు కూడా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రి రిలీజ్ వేడుక సంద‌ర్భంగా రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ప్ర‌తి మ‌నిషి జీవితంలో న‌వ్వు ముఖ్య‌మ‌ని.. తాను 40 ఏళ్ల నుంచి నేర్చుకున్న‌ది అదే అని అన్నారు. అయితే ఎఫ్3 మూవీ బోలెడ‌న్ని న‌వ్వుల‌ను పంచుతుంద‌ని.. సినిమా హిట్ అవుతుంద‌ని.. అలా కాకుంటే తాను ఇక‌పై సినిమాల్లో క‌నిపించ‌న‌ని.. ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఈ మూవీ మే 27న విడుద‌ల కానుంది. ఇందులో పూజా హెగ్డె ప్ర‌త్యేక సాంగ్‌లో అల‌రించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment