F3 Movie : ఓటీటీలో ఎఫ్3 మూవీ.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..?

July 3, 2022 4:22 PM

F3 Movie : ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్3 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఎఫ్2 లాగే ఇందులోనూ కామెడీని పండించారు. ఎఫ్2లో ఉన్న న‌టీన‌టులు అంద‌రూ ఇందులోనూ సంద‌డి చేశారు. ముఖ్యంగా వెంక‌టేష్ త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో మ‌రోమారు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా నిర్మాత‌ల‌కు భారీగానే లాభాల‌ను తెచ్చి పెట్టింది. దీంతో అనిల్ రావిపూడి ఎఫ్4ను కూడా తీస్తాన‌ని.. అందులో స్టార్ హీరోల‌ను న‌టింప‌జేస్తాన‌ని తెలిపారు. కాగా వేస‌విలో మే 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

ఎఫ్3 మూవీ థియేట‌ర్లలో రిలీజ్ అయితే నెల రోజుల‌కు పైగానే అవుతోంది. అయిన‌ప్ప‌టికీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను సోనీ లివ్ సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే జూలై 22 నుంచి ఈ మూవీని సోనీ లివ్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇక ఈ మూవీలో వెంక‌టేష్ ప‌క్క‌న త‌మ‌న్నా న‌టించ‌గా.. వ‌రుణ్ తేజ్ ప‌క్క‌న య‌థావిధిగానే మెహ్రీన్ యాక్ట్ చేసింది.

F3 Movie releasing on OTT know the date and app
F3 Movie

ఎఫ్3 మూవీని దిల్ రాజు నిర్మించ‌గా.. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఇందులో పూజా హెగ్డె ఓ ప్రత్యేక సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా.. అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్ష‌కుల‌నే కాక క్లాస్ ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రించింది. ఇప్ప‌టికీ ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. అయితే ఎట్ట‌కేల‌కు ఎఫ్‌3 మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ మూవీని ఎప్పుడు చూద్దామా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment