F3 Movie : ఎఫ్3 మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌.. ఎందులో.. ఎప్పుడు అంటే..?

May 26, 2022 12:25 PM

F3 Movie : వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా.. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా వ‌స్తున్న చిత్రం.. ఎఫ్3. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఈ నెల 27వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఎఫ్2కు సీక్వెల్ గా వ‌స్తున్న ఎఫ్3 మూవీలో వినోదం రెండు రెట్లు పెరిగింద‌ని ఇప్ప‌టికే విడుద‌లైన ఎఫ్3 ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ మూవీకి చెందిన స్టోరీ కూడా సోష‌ల్ మీడియాలో లీకైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సెకండాఫ్ లో 20 నిమిషాల పాటు ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించే ఎపిసోడ్ ఒక‌టి ఉంటుంద‌ని స‌మాచారం. దీంతో మూవీకి ఇదే హైలైట్ అవుతుంద‌ని అంటున్నారు.

ఇక ఎఫ్3 మూవీకి గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో అదే ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీ విడుదల కానుంది. అయితే నిర్మాత దిల్ రాజు చెబుతున్న ప్ర‌కారం.. సినిమా విడుద‌లైన 50 రోజుల త‌రువాతే ఓటీటీలోకి ఇవ్వాల‌ని అనుకున్నార‌ట‌. అలా చూస్తే ఎఫ్3 మూవీ జూలైలోనే స్ట్రీమ్ అవుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఇదంతా సినిమా హిట్ అయితేనే జ‌రుగుతుంది. లేదంటే మూవీ 3 వారాల్లోనే ఓటీటీలోకి వ‌స్తుంది. ఇక ఈ విష‌యంపై మ‌రికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.

F3 Movie OTT platform fixed know the app and date
F3 Movie

కాగా ఎఫ్3 మూవీలో సునీల్, రాజేంద్ర ప్ర‌సాద్, సోనాల్ చౌహాన్‌లు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే పూజా హెగ్డె ఓ ప్ర‌త్యేక సాంగ్‌లో అల‌రించింది. ఆ పాట ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే సినిమా కూడా హిట్ అవుతుంద‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు. క‌రోనా మూడో వేవ్ త‌రువాత ప‌క్కా కామెడీ జోన‌ర్‌లో రిలీజ్ అవుతున్న మొద‌టి మూవీ ఇదే కావ‌డం విశేషం. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందా.. అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment