F3 Movie : ఓటీటీలోకి వస్తున్న ఎఫ్‌3 మూవీ.. క్లారిటీ ఇచ్చేశారు..!

June 2, 2022 7:07 PM

F3 Movie : అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. ఎఫ్3. ఎఫ్‌2 తరువాత ఈ మూవీ రావడంతో దానికి సీక్వెల్‌ ఏమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఎఫ్‌3లో కొత్త కథను చూపించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్ల వసూలు దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ ప్రస్తుతం సక్సెస్‌ సంబరాలను నిర్వహిస్తోంది.

అయితే ఏ మూవీ విడుదల అయినా నెల రోజులు లేదా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. దీంతో ఎఫ్‌3 కూడా అలాగే వస్తుందని అనుకున్నారు. ఈ మేరకు ఓ వార్త కూడా బాగా ప్రచారం అయింది. అయితే దీనిపై వెంకటేష్‌ స్పందించారు. ఈ మూవీని 8 వారాల తరువాతనే ఓటీటీలోకి ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు థియేటర్లకే వచ్చి నవ్వుకోవాలని అన్నారు. అంటే ఈ సినిమా మే27వ తేదీన రిలీజ్ అయింది కనుక జూలై చివర్లో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఇది కూడా కలెక్షన్లను బట్టే ఆధార పడి ఉంటుంది. మూవీకి ఇంకొన్ని రోజులు పోతే కలెక్షన్లు ఎలాగూ తగ్గుతాయి కనుక.. ఓటీటీకి ఇచ్చేస్తే కనీసం కాస్త ఎక్కువ మొత్తంలో అయిన ధర వస్తుంది. కనుక వారు 8 వారాలు అన్నారు కాబట్టి అప్పటి వరకు సినిమాను ఓటీటీలోకి రాకుండా ఆపుతారా.. అన్నది సందేహమే. అంతకన్నా ముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

F3 Movie makers given clarity on OTT release
F3 Movie

ఇక ఇందులో సోనాల్‌ చౌహన్‌, మురళీ శర్మ, అలీ, సునీల్‌, నటి ప్రగతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో నటి ప్రగతి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. తన సినిమా కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్లలో నటించాను కానీ.. ఇలా ఎఫ్‌2, ఎఫ్‌3 మూవీలలో భిన్నమైన పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారని.. ఇందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ఇలాంటి కాన్సెప్ట్‌తో మూవీ తీసేందుకు ట్రై చేస్తానన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment