Extra Jabardasth : ఆ జబర్దస్త్ కమెడియన్ పై చేయి చేసుకోబోయిన మనో..!

November 3, 2021 4:58 PM

Extra Jabardasth : బుల్లి తెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్న కార్యక్రమాల్లో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఇప్పటికే మల్లెమాల ప్రొడక్షన్ లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు పోటీగా ఎన్ని కార్యక్రమాలు వచ్చినా వెనక్కి నెట్ట లేకపోయాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి జబర్దస్త్ రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో నిర్వాహకులు ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు.

Extra Jabardasth mano unhappy with rocking rakesh

 

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలలో ఎన్నో ట్విస్టులు పెడుతూ ఆద్యంతం ఈ కార్యక్రమంపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్స్ అందరూ స్కిట్ చేయగా చివరికి రాకింగ్ రాకేష్ స్కిట్ చూసిన మనో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్కిట్ అనంతరం మాట్లాడుతూ ఏంటి ఇది అని అడగగా అందుకు రాకేష్ స్కిట్ అని సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళి పోయారు.

ఇక రోజా మనోను ఆపడానికి ప్రయత్నించినా ఆయన వినలేదు, ఈ క్రమంలోనే స్టేజీ దిగి వెళ్ళిపోతుండగా రాకేష్ రాకేష్ టీం అడ్డుకొని పైకి రండి సార్ అని బతిమాలగా ముందు మీరు వెళ్ళండి అంటూ కోపగించుకున్నారు. ఇక రాకేష్ టీం సభ్యులు సారీ చెప్పబోతున్నా మనో వెంటనే తనని కొట్టడానికి చేయి పైకెత్తారు. ఈ క్రమంలోనే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇది ప్రోమో కోసమే ఇలా చేశారా లేకపోతే నిజంగానే మనో సీరియస్ అయ్యారా.. అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now