Exit Polls : ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి.. హుజురాబాద్‌లో ఈట‌ల‌.. బ‌ద్వేల్‌లో వైసీపీ గెలుపు..

October 30, 2021 10:19 PM

Exit Polls : గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌, ఏపీల‌లో ఉప ఎన్నిక‌ల హ‌డావిడి జోరుగా ఉండేది. అయితే శ‌నివారం హుజురాబాద్‌, బ‌ద్వేల్ అసెంబ్లీ స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. ఈ క్ర‌మంలో రాజ‌కీయ వేడి త‌గ్గినా.. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు మాత్రం అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక గ‌తంలోక‌న్నా హుజురాబాద్‌లో ఇప్పుడు 2 శాతం ఎక్కువ పోలింగ్ న‌మోదు కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Exit Polls  announced etala will win in huzurabad and ysrcp in badvel

అయితే పోలింగ్ ముగిసిన నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను ప‌లు స‌ర్వే సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే ఏపీలో బద్వేల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌ని, అక్క‌డి ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు చాలా బ‌ల‌హీనంగా ఉన్నార‌ని.. ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మ‌రోవైపు తెలంగాణ‌లో హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల గెలుపు ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌, సెఫాల‌జిస్ట్ మూర్తి స్థాపించిన ఆత్మ‌సాక్షి గ్రూప్ చేసిన స‌ర్వే ప్ర‌కారం.. హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌కు 50.5 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని, తెరాస అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు 43.1 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్‌కు కేవ‌లం 5.7 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్పారు.

ఇక ఆత్మ‌సాక్షి గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. తెరాస అభ్య‌ర్థిపై ఈట‌ల సుమారుగా 10,500 నుంచి 12,300 ఓట్ల మెజారిటీతో గెలుస్తార‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈట‌ల 40వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్ర‌స్తుతం తెరాస ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నందునే ప్ర‌జ‌లు ఈట‌ల‌కు ఓటు వేశార‌ని తెలుస్తోంది. ద‌ళిత బంధు స్కీమ్ ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింద‌ని స‌మాచారం.

పీపుల్స్ ప‌ల్స్ చేసిన స‌ర్వే ప్ర‌కారం.. తెరాస క‌న్నా బీజేపీకి 9 శాతం ఓట్లు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని చెప్పారు. ఈట‌ల‌కు ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉండ‌డం, వ్య‌క్తిగ‌త ఇమేజ్‌, యువ‌త స‌పోర్ట్ వ‌ల్ల ఈట‌ల గెలుస్తార‌ని చెప్పారు.

ఇక కౌటిల్య సొల్యూష‌న్స్ చేసిన ఎగ్జిట్ పోల్ స‌ర్వే ప్ర‌కారం.. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీకి 47 శాతం ఓట్లు, తెరాస‌కు 40 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 8 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పారు.

అలాగే పోల్ ల్యాబొరేట‌రీ అనే ఇంకో సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. హుజురాబాద్‌లో ఈట‌ల 23వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తార‌ని చెప్పారు. ఆయ‌న‌కు ఏకంగా 51 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని అన్నారు. తెరాస‌కు 42 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 3 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈట‌ల‌కు ప‌ట్టం క‌ట్ట‌డం విశేషం. మ‌రి కౌంటింగ్ రోజు ఫ‌లితం ఎలా వ‌స్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now