Evaru Meelo Koteeshwarulu : రూ.1 కోటి గెలుచుకున్న కంటెస్టెంట్‌ అన్ని ల‌క్ష‌లు లాస్ అవుతాడా..?

November 17, 2021 4:32 PM

Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్ర‌మంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారి రాజా రవీంద్ర మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. 1 కోటి రూపాయలు గెలుచుకున్నాడు. చాలా ధైర్యంగా ఆడుతూ వ‌చ్చిన రాజా ర‌వీంద్ర చివ‌రి ప్ర‌శ్నకు స‌రైన స‌మాధానం చెప్పి విజేత‌గా నిలిచాడు. కోటి రూపాయలను గెలుచుకున్న కంటెస్టెంట్‌కు ఇచ్చే చెక్‌పై సంతకం చేసే అదృష్టం కలిగింది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

Evaru Meelo Koteeshwarulu winner losses that much amount of money after taxes

చెక్ ఇచ్చే ముందు రాజా రవీంద్ర భార్య సింధూజను వేదికపైకి పిలిచారు. రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకోవడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. మీ భర్తకు ఏం చెప్పాలనుకుంటున్నారు.. అని అడిగితే.. బావ ఐ లవ్ యూ.. అంటూ సింధూజ తన ప్రేమను, ఆనందాన్ని వ్యక్తంచేసింది.

దాంతో ఎన్టీఆర్ అదే మాటను మళ్లీ చెప్పించారు. మీకు చెక్ ఇవ్వడానికి చాలా గర్వంగా ఉంది అంటే.. మీ చేతుల మీదుగా ఈ చెక్‌ను అందుకోవడం గర్వంగా ఉంది అని రాజా రవీంద్ర దంపతులు అన్నారు.

అయితే కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్రకు నిబంధనల ప్రకారం దక్కేది మాత్రం తక్కువే. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఎవరైనా ఓ టీవీ షోలో రూ.10,000 మించి ప్రైజ్ మనీ గెలుచుకుంటే 31.2 శాతం టాక్స్ చెల్లించాలి. దీని ప్రకారం రాజా రవీంద్రకు కేవలం రూ. 68.80 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. టాక్స్ మినహాయించుకొని, మిగిలిన అమౌంట్ విన్నర్ కి ఇస్తారు. రూ.31,20,000 పన్ను రూపంలో కోల్పోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now