Esther Anil : దృశ్యం పాప‌ను ఆ ఫొటో అడిగిన నెటిజ‌న్‌.. అందుకు ఆమె రిప్లై అదుర్స్‌..!

July 10, 2022 6:34 PM

Esther Anil : వెంక‌టేష్‌, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంత‌టి ఘ‌న విజ‌యాల‌ను సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీల‌లో వెంక‌టేష్ న‌ట‌న అద్భుతం. రీమేక్స్ అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇప్ప‌టికీ ఈ మూవీలు టీవీల్లో వస్తుంటే ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూస్తుంటారు. అయితే దృశ్యం సినిమాల్లో వెంక‌టేష్ కుమార్తెగా న‌టించిన ఎస్తెర్ అనిల్ గురించి కూడా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఈ మూవీల ద్వారానే కాకుండా సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల ద్వారా కూడా ఎంతో పాపుల‌ర్ అయింది.

ఎస్తెర్ అనిల్ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. దృశ్యం మొద‌టి పార్ట్‌లో ఈమె బాలిక‌గా క‌నిపించింది. కానీ ఇప్పుడు యువ‌తిగా ఎదిగింది. ఈ క్ర‌మంలోనే త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను అందులో షేర్ చేస్తోంది. దీంతో చాలా మంది ఈమెకు అభిమానులు అయ్యారు. ఫాలోవ‌ర్లు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. అయితే ఓ నెటిజ‌న్ ఎస్తెర్ అనిల్ ను అసభ్య‌క‌ర‌మైన ప్ర‌శ్న అడిగాడు.

Esther Anil stunning reply to a netizen who asked her that question
Esther Anil

సోష‌ల్ మీడియాలో ఎస్తెర్ అనిల్‌కు ఓ నెటిజ‌న్ అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌శ్న వేశాడు. ఆమె న‌గ్న ఫొటో పంపాల‌ని అడిగాడు. అయితే అందుకు ఆమె దీటుగా రిప్లై ఇచ్చింది. ఓ మూవీలో ఓ వ్య‌క్తి అర్థ‌న‌గ్నంగా ఉన్న ఫొటోను అత‌నికి పంపింది. దీంతో అత‌ను షాక‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ఆమెను నెటిజన్లు కొనియాడుతున్నారు. అలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పాల‌ని ఆమెను అభినందిస్తున్నారు. ఇక ఈమె ప్ర‌స్తుతం సినిమాల్లో ఆఫ‌ర్ల కోసం వేచి చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now