Sreemukhi : శ్రీముఖిని అంత మాట అనేసిన ఇమ్మాన్యుయెల్‌..!

May 24, 2022 6:27 PM

Sreemukhi : బుల్లితెర యాంకర్లలో శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టీవీ షోల్లో చేసే సందడి మామూలుగా ఉండదు. పటాస్‌ షోతో చాలా పాపులర్‌ అయిన శ్రీముఖి తరువాత పలు సినిమాల్లోనూ నటించింది. స్వతహాగానే శ్రీముఖిది అల్లరి స్వభావం. చిన్న పిల్లల మాదిరిగా అల్లరి చేస్తుంటుంది. దీంతో షో చాలా ఉత్సాహంగా సాగుతుంటుంది. షోలో ఈమె తోటి యాంకర్లు లేదా కమెడియన్లపై వేసే పంచ్‌లు కూడా అలరిస్తుంటాయి. ఇక ఓవైపు యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈమెకు బిగ్ బాస్‌ ద్వారా మరింత పాపులారిటీ లభించింది. దీంతో ఈమెకు ఆఫర్లు ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు.

ప్రస్తుతం శ్రీముఖి జీ తెలుగులో సింగింగ్‌ ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా చేస్తోంది. అలాగే జాతిరత్నాలు అనే కామెడీ షోలోనూ అలరిస్తోంది. అయితే శ్రీముఖి సహజంగానే కాస్త బొద్దుగా ఉంటుంది. బిగ్‌బాస్‌ సమయంలో ఈమె కాస్త బరువు తగ్గినా.. మళ్లీ బరువు పెరిగింది. ఈ క్రమంలోనే శ్రీముఖి బొద్దుగా ఉండడంపై టీవీ షోలలో ఈమెపై సెటైర్లు, పంచ్‌లు వేస్తూనే ఉంటారు. కానీ ఆమె వాటిని సరదాగానే తీసుకుంటుంది. ఇక జాతి రత్నాలు షోలో భాగంగా కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌.. శ్రీముఖి లావుగా ఉండడంపై పంచ్‌లు వేశాడు.

Emmanuel comments on Sreemukhi
Sreemukhi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ మూవీ ఎంతటి హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో పవన్‌ భీమ్లా నాయక్‌గా నటించగా.. ఆయన భార్య పాత్రలో సుగుణగా నిత్య మీనన్‌ అలరించింది. ఇక డానియెల్‌ శేఖర్‌ పాత్రలో రానా మెప్పించారు. అయితే జాతిరత్నాలు షోలో భాగంగా ఇమ్మాన్యుయెల్‌ డానియెల్‌ శేఖర్‌ పాత్రలో ఎంట్రీ ఇవ్వగా.. శ్రీముఖి సుగుణ పాత్రలో అలరించింది. ఈ క్రమంలోనే డానియెల్‌ శేఖర్‌ పాత్రలో ఉన్న ఇమ్మాన్యుయెల్‌ నీ మొగుడికి షుగర్‌ అంటాడు. అందుకు శ్రీముఖి సుగుణగా బదులిస్తూ.. నాయక్‌ భార్య అంటే నాయక్‌లో సగం కాదు.. నాయక్‌కు డబుల్‌.. అంటుంది. దీనికి ఇమ్మాన్యుయెల్‌.. అవును నువ్వు డబులే.. చూస్తేనే తెలుస్తుందిగా ఎంత డబుల్‌ ఉన్నావో.. అని పంచ్‌ వేస్తాడు. ఇలా శ్రీముఖి లావుగా ఉండడంపై ఇమ్మాన్యుయెల్‌ పంచ్‌ వేశాడు. అయినప్పటికీ శ్రీముఖి దీన్ని చాలా లైట్‌గా తీసుకుంది. ఇక ఈ షోకు చెందిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now