Jabardasth Varsha : వర్ష అమ్మాయి కాదు.. మగాడు.. ఇమ్మాన్యుయెల్‌ కామెంట్స్ వైరల్..

March 14, 2022 5:44 PM

Jabardasth Varsha : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సుధీర్, రష్మీ జోడి తర్వాత అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న జంటగా పేరు సంపాదించుకున్నారు వర్ష, ఇమ్మాన్యుయెల్‌. సుధీర్, రష్మీ ఢీ జోడి తర్వాత ఈ జంటకు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో వీరిద్దరూ కలిసి చేసిన స్కిట్ లతో వీరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Emmanuel comments on Jabardasth Varsha
Jabardasth Varsha

ఇదిలా ఉండగా తాజాగా హోలీ సందర్భంగా మల్లెమాల వారు నిర్వహించనున్న రంగ్ దే అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ వర్ష గురించి ఇమ్మాన్యుయెల్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇమ్మాన్యుయెల్‌.. వర్ష గురించి మాట్లాడుతూ తను అసలు అమ్మాయి కాదని.. మగాడని.. అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

ఈ విధంగా తన గురించి ఇమ్మాన్యుయెల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వర్ష.. నీ అసలు రూపం ఇదే.. నీ నిజ స్వరూపం బయటపడింది.. అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. వర్ష గురించి ఇమ్మాన్యుయెల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి అయితే ఇమ్మాన్యుయెల్‌ వర్ష గురించి నిజంగానే అన్నాడా ? లేక ఇది కూడా ప్రోమోలో భాగమా.. అంటూ నెటిజన్లు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now