Electric Two Wheelers : వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్స్‌.. అస‌లు కార‌ణం ఏమిటి ?

Electric Two Wheelers : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎలా పెరిగిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. దీని కార‌ణంగా చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. కార్లు, టూ వీల‌ర్లు ప్ర‌స్తుతం చాలా కంపెనీల‌కు చెందినవి మ‌న‌కు ఎల‌క్ట్రిక్ మోడ‌ల్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అందుక‌నే వీటిని చాలా మంది కొంటున్నారు. వీటి వాడ‌కం వ‌ల్ల మైలేజీ అధికంగా రావ‌డంతోపాటు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల భారాన్ని మోసే బాధ త‌ప్పుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. ప్ర‌స్తుతం ప‌లు కంపెనీల‌కు చెందిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్స్ వ‌రుస‌గా అగ్ని ప్రమాదాల బారిన ప‌డుతున్నాయి. దీంతో ఈ వాహ‌నాల‌ను కొనాలంటేనే వినియోగ‌దారులు భ‌య‌ప‌డిపోతున్నారు. అయితే ఇలా ఎలక్ట్రిక్ స్కూట‌ర్స్ అగ్ని ప్రమాదాల బారిన ఎందుకు ప‌డుతున్నాయి ? వీటికి మంట‌లు ఎందుకు అంటుకుంటున్నాయి ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్స్‌, కార్లు, ఫోన్ల‌లో ప్ర‌స్తుతం ఎల్ఐ-అయాన్ లేదా లిథియ‌మ్‌-అయాన్ బ్యాట‌రీల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. వీటి వాడ‌కం వ‌ల్ల బ్యాట‌రీ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం పాటు బ్యాక‌ప్ వ‌స్తుంది. అందుక‌నే వీటిని ఎక్కువ‌గా ఆయా వస్తువుల్లో ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటి వాడ‌కం వ‌ల్ల న‌ష్టాలు కూడా ఉన్నాయి. ఉష్ణోగ్ర‌త మ‌రీ అధికంగా ఉన్న ప్ర‌దేశంలో ఈ బ్యాట‌రీలు సుల‌భంగా పేలేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అలాగే మానుఫాక్చ‌రింగ్ లోపాలు ఉన్నా.. డివైస్‌లో వైరింగ్ స‌మస్య ఉన్నా.. లేదా.. బ్యాట‌రీలో స‌మ‌స్య ఉన్నా.. ఎక్కువ సేపు అవ‌స‌రం అయిన దానికంటే అధికంగా చార్జింగ్ పెట్టినా.. చార్జింగ్ పెట్టే ప్ల‌గ్ లేదా అక్క‌డి విద్యుత్ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య ఉన్నా.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల లిథియ‌మ్-అయాన్ బ్యాట‌రీలు సులభంగా పేలిపోతాయి. లేదా ఆ అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

Electric Two Wheelers

అయితే ప్ర‌స్తుతం మంట‌లు అంటుకుంటున్న ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ఉష్ణోగ్ర‌త అధికంగా ఉన్న ప్ర‌దేశంలో వాహ‌నాన్ని న‌డిపించ‌డం లేదా చార్జింగ్ పెట్ట‌డం.. లేదా ఇష్టానుసారంగా చార్జింగ్ పెట్ట‌డం వ‌ల్లే.. ఆ వాహ‌నాలు షార్ట్ స‌ర్క్యూట్ అయి ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని.. నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక నాసిర‌కం బ్యాట‌రీలను వాడినా ఇలాగే జ‌రుగుతుంది. క‌నుక కంపెనీ అందించే లిథియ‌మ్‌-అయాన్ బ్యాట‌రీ నాసిర‌కంది అయి ఉండ‌వ‌చ్చ‌ని అందుక‌నే వాహ‌నాలు పేలుతున్నాయ‌ని కూడా అంటున్నారు.

అయితే ఇలా ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నాయ‌ని చెప్పి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వాడ‌కాన్ని మానుకోవాల్సిన ప‌నిలేదని.. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. ఎలాంటి హాని సంభ‌వించ‌ద‌ని.. మ‌నం చేసే చిన్న పొర‌పాట్ల వల్లే ఎక్కువ‌గా ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ని కూడా నిపుణులు అంటున్నారు. ఇక వాహ‌న‌దారులు అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఎలాంటి భ‌యం లేకుండా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను న‌డుపుకోవ‌చ్చు. లేదంటే ప్ర‌మాదాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM