Egg Dum Biryani : మీ ఇంట్లోనే ఎగ్ ద‌మ్ బిర్యానీని ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి.. హోట‌ల్ లాంటి రుచి వ‌స్తుంది..!

Egg Dum Biryani : బిర్యానీ.. ఈ ప‌దం విన‌ని వాళ్లు, దీని రుచి చూడ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు.. అంటే అది అతిశ‌యోక్తి కాదు. బిర్యానీని మ‌నం ఎక్కువ‌గా హోట‌ల్స్‌లో తింటూ ఉంటాం. ఇది మ‌న‌కు అనేక రుచులల్లో దొరుకుతుంది. అందులో ఎగ్ ద‌మ్ బిర్యానీ ఒక‌టి. హోట‌ల్స్ లో ఉండే రుచిలా ఇంట్లో నే మ‌నం ఎగ్ ద‌మ్ బిర్యానీని చాలా సులువుగా త‌యారుచేసుకోవ‌చ్చు. ఎగ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను, త‌యారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Egg Dum Biryani

ఎగ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం -అర కిలో, ఎగ్స్ – 4 , అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్‌, పెరుగు – పావు క‌ప్పు, వేయించిన ఉల్లి పాయ‌లు – ఒక క‌ప్పు, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్‌, కారం – 2 టీ స్పూన్స్‌, ప‌సుపు – పావు టీ స్పూన్‌, త‌రిగిన కొత్తి మీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నూనె – 4 టీ స్పూన్స్‌, ఉప్పు – రుచికి త‌గినంత‌, యాల‌కులు – 4, ల‌వంగాలు – 5, దాల్చిన చెక్క – కొద్దిగా, సాజీరా – ఒక టీ స్పూన్‌.

బిర్యానీ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బిర్యానీ ఆకులు -4, ఎండు మిర‌ప‌కాయ‌లు – 4, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్‌, సాజీరా – ఒక టీ స్పూన్, జాప‌త్రి – 3, దాల్చిన చెక్క – 2 లేదా 3, ల‌వంగాలు – 5, యాల‌కుల‌- 5, జాజి కాయ – 1 , మ‌రాఠీ మొగ్గ‌- 2, అనాస పువ్వు – 3.

ఎగ్ ద‌మ్ బిర్యానీ తయారీ విధానం..

ముందుగా బియ్యాన్ని గంట సేపు నాన‌బెట్టాలి. ఎగ్స్ ను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. త‌రువాత‌ ఒక క‌ళాయిలో బిర్యానీ మ‌సాలాకు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నింటినీ వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ప‌దార్థాల‌ను ఒక జార్‌లో వేసి మెత్త‌టి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం, బియ్యానికి స‌రిప‌డా నీళ్లు, కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు, యాల‌కులు, సాజీరా, దాల్చిన చెక్క‌, లవంగాలు వేసి 80 శాతం వ‌ర‌కు బియ్యాన్ని ఉడికించి, ఎక్కువ‌గా ఉన్న నీటిని తీసేసి ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక‌పెద్ద క‌ళాయి లేదా బిర్యానీకి స‌రిప‌డా గిన్నె ను తీసుకుని అందులో నూనె వేసి కాగాక కారం, ప‌సుపు వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి వేయించుకోవాలి.

ఎగ్స్ వేగాక ప‌క్క‌కు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయి లేదా పాత్ర‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పెరుగు, గ‌రం మ‌సాలా, అర క‌ప్పు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ‌లు, ధ‌నియాల పొడి, రుచికి స‌రిప‌డా ఉప్పును వేసుకుని వేయించుకోవాలి. త‌రువాత కొద్దిగా కొత్తి మీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి క‌లుపుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మంలో సగం మిశ్ర‌మాన్ని తీసి ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో సగం అన్నాన్ని క‌ళాయిలో మిగిలిన మిశ్ర‌మంపై స‌మానంగా వేసుకోవాలి.

ఇలా వేసుకున్న అన్నంపై మిగిలిన మిశ్ర‌మాన్ని, ఎగ్స్ ను, కొద్దిగా వేయించిన ఉల్లిపాయ‌ల‌ను స‌మానంగా వేసుకోవాలి. ఈ ఎగ్స్ పై మిగిలిన అన్నాన్ని స‌మానంగా వేసిన త‌రువాత కొద్దిగా కొత్తిమీర‌, కొద్దిగా పుదీనా, కొద్దిగా వేయించిన ఉల్లిపాయ‌ల‌ను వేయాలి. ఇప్పుడు అన్నంపై కొద్దిగా నీటిని చల్లి, మూత పెట్టి చిన్న మంట‌పై అన్నం పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ద‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని మిర్చి కా సాల‌న్ లేదా పెరుగు చ‌ట్నీ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM