Chaddannam : ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..!

August 26, 2022 10:02 PM

Chaddannam : పెద్దల మాట చద్ద‌న్నం మూట అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఇలా ఎందుకు అంటారు అంటే పెద్దలు ఎప్పుడూ మన మంచిని కోరుకుంటారు అని ఈ సామెత అర్థం. ఇప్పుడు మారుతున్న జీవనశైలిని బట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ అంటూ ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా అంటూ నాలుకకు రుచిగా అనిపించే పదార్థాలను తింటున్నాం. కానీ మన పూర్వకాలంలో పెద్దలకు బ్రేక్ ఫాస్ట్ అంటేనే తెలియదు. వాళ్లకు  బ్రేక్ ఫాస్ట్ ఉదయాన్నే చద్దన్నం తిన‌డం. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ చద్దన్నం ఎంతో సహకరిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

అందుకే పూర్వం పెద్దవాళ్లు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దాదాపు వంద ఏళ్ళ వరకు జీవించేవారు. రాత్రి వండిన అన్నంలో పెరుగు వేసి బాగా కలిపి దానిలో ఒక ఉల్లిపాయ ముక్క వేసి ఉదయం వరకూ ఉంచితే దానినే చద్దన్నం అంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ చద్దన్నం తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మరి చద్దన్నం తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.

eat Chaddannam daily in the morning for these benefits
Chaddannam

చద్దన్నం తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా అందుతుంది.  కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఎప్పుడూ నీరసంగా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు చద్దన్నం తినడం వల్ల జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. పేగు సంబంధిత సమస్యలు, అల్సర్స్ తో బాధపడుతున్నవారికి చద్దన్నం పరమౌషధంగా పనిచేస్తుంది.

చద్దన్నంలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహకరిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల కడుపు నిండుగా అయిన భావన కలిగి త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరానికి శక్తిని అందించి అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. క‌నుక రోజూ చ‌ద్ద‌న్నాన్ని తిన‌డం అల‌వాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment