Water : ప్రతి జీవి మనుగడకు నీరు ఎంతో అవసరం. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, శరీర ఉష్ణోగ్రతను సక్రమంగా నిర్వహించడం, సున్నితమైన కణజాలాలను రక్షించడం, కీళ్ళలో ద్రవపదార్థం తయారు చేయడం వంటి ముఖ్యమైన పనులను నిర్వహించడానికి కూడా నీరు అవసరం. కానీ ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలిసిన విషయమే. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక బాటిల్ నీటిని త్రాగితే శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఈ మార్పులను చూస్తే మీకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రతి మనిషి దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్ర పోతారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో నీరు తాగాలి అనే ఆలోచన కూడా రాదు. నిద్రపోయే సమయంలో శరీరం డీహైడ్రేట్ అవడం మొదలవుతుంది. ఉదయం లేవగానే ఒక లీటరు నీటిని తాగడం ద్వారా శరీరం మళ్ళీ రీహైడ్రేట్ అవుతుంది. మనం చాలాసార్లు గమనించే ఉంటాం.. ఉదయాన్నే మనం ఏమీ తినకుండా ఉండటం వల్ల ప్రేగులు అతుక్కుని ఉంటాయి. నీటిని త్రాగకుండా డైరెక్ట్ గా ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కడుపులో నొప్పి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం నీటిని తాగుతామో ప్రేగుల కదలికకు సహాయపడుతుంది. ఈ విధంగా లీటర్ నీటిని త్రాగటం వలన జీర్ణక్రియ రేటు పెరిగి కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయి.
దానివలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగి బరువు తగ్గుతారు. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక లీటర్ నీటిని తాగడం ద్వారా మలబద్దకం సమస్య కూడా తొలగిపోయి విరేచనం సాఫీగా అయ్యి ఆకలి కూడా పెరుగుతుంది. నీరు ఎర్ర రక్త కణాల పెరుగుదలను వేగంవంతం చేసి రక్తంలో ఎక్కువ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కారకాల కలయిక వలన మెదడుకు 70 శాతంకి పైగా నీరు అందుతుంది. మెదడు హైడ్రేడ్ గా ఉంటేనే జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరులో గణనీయమైన మార్పులు వస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల తలనొప్పి, అలసట, అజీర్తి అనేది దరిచేరకుండా చేస్తుంది. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీరు త్రాగడం ద్వారా చర్మం కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలను కూడా దరిచేరనివ్వదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…