మందార పువ్వుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌నం ఇంటి పెర‌ట్లో అందం, అలంక‌ర‌ణ కోసం పెంచుకునే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న అంద‌రికీ సుప‌రిచిత‌మే. దీనిని చైనా హైబిస్క‌స్, చైనా రోస్ అనే పేర్ల‌తో పిలుస్తారు. మందార మొక్క‌ల్లో కూడా అనేక ర‌కాలు ఉంటాయి. మందార పువ్వుల‌ను మ‌నం దేవుడి పూజ‌లో కూడా ఉప‌యోగిస్తాం. ఈ పూల‌ను స్త్రీలు జ‌డలో కూడా ధ‌రిస్తారు. కేవ‌లం అలంక‌ర‌ణ కోసం మాత్ర‌మే కాకుండా మందార పువ్వుల‌ను ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. మందార పువ్వుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉంటాయి.

మందార‌ పువ్వులే కాకుండా మందార చెట్టు ఆకులు, వేర్లు కూడా ఔష‌ధ గుణాలను క‌లిగి ఉంటాయి. మందార చెట్టును సౌంద‌ర్య పోష‌ణ‌కు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ముఖ్యంగా కేశాల సంర‌క్ష‌ణ కోసం దీనిని ఎక్కువ‌గా వాడ‌తారు. కొబ్బ‌రి నూనెలో మందార పూల‌ను వేసి వేడి చేయాలి. ఈ నూనెను చ‌ల్లారిన త‌రువాత వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. దీనిని త‌ర‌చూ త‌ల‌కు రాసుకోవడం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డ‌మే కాకుండా జుట్టు న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతూ ఉంటుంది.

మందార పువ్వు పుప్పొడి కాడ‌ల‌ను నూనెలో వేసి వేయించి ఆ మిశ్ర‌మాన్ని పేనుకొరుకుడు ఉన్న చోట రాయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. చుండ్రు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మందార పువ్వుల‌ను ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని త‌ల‌కు ప‌ట్టించి అర గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉండ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది. అంతేకాకుండా ఈ మందార‌పువ్వుల పొడిని నీటిలో వేసి ఆ నీటితో ముఖాన్ని క‌డుక్కోవ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

ఒక గ్లాస్ నీటిలో 3 మందార పువ్వుల‌ను వేసి 10 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి కొద్దిగా తేనెను క‌లిపి తాగ‌డం వ‌ల్ల అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మందార టీ ని తాగ‌డం వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్లు, బీపీ వంటి స‌మ‌స్యల నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మందారంలో విట‌మిన్ సి, కాల్షియం, ఐర‌న్ వంటి వాటితోపాటు ఇతర పోష‌కాలు కూడా ఉంటాయి. నెల‌స‌రి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే స్త్రీల‌కు మందార ప‌వ్వులు ఎంతో చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.

మందార పూల రెబ్బ‌ల‌ను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని మ‌జ్జిగ‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. మందారంలో యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. మందార పువ్వులను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోట లేప‌నంగా రాసి అర‌గంట త‌రువాత క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మస్య‌ రాకుండా ఉంటుంది.

మందార చెట్టు ఆకుల‌ను మెత్త‌గా నూరి గాయాల‌పై ఉంచి క‌ట్టుక‌ట్ట‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. మందార పువ్వు మ‌లేషియా దేశం జాతీయ పుష్పం. కొన్ని దేశాల‌లో మందార పువ్వులను స‌లాడ్ ల‌లో, సూప్ ల‌లో కూడా వేసుకుంటారు. మందార పువ్వుల‌ను, ఆకుల‌ను ఈ విధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంతోపాటు శ‌రీర ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM