Anasuya : అన‌సూయ భ‌ర్త‌గా దొర‌బాబు.. వార్నింగ్ ఇచ్చిన రంగ‌మ్మ‌త్త‌..!

June 12, 2022 9:56 AM

Anasuya : వెండితెర‌పై రంగ‌మ్మ‌త్త‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఓ వైపు టీవీ షోల‌తో అల‌రిస్తూనే.. మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తూ త‌న స‌త్తా చాటుతోంది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగమ్మ‌త్త‌గా అల‌రించిన ఈమె త‌రువాత పుష్ప సినిమాలో దాక్షాయ‌ణి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. త‌రువాత ఖిలాడి మూవీలో గ్లామ‌ర్ పాత్ర చేసి అద‌ర‌హో అనిపించింది. ఇక బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఈమె చేసే హంగామా మామూలుగా ఉండ‌దు. ఈ షోలో చేసే స్కిట్స్ మీద అన‌సూయ స్పందిస్తూ ఉంటుంది. అయితే త్వ‌ర‌లో ప్ర‌సారం కానున్న జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్‌లో అన‌సూయ రైజింగ్ రాజు టీమ్ కు వార్నింగ్ ఇచ్చింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

జూన్ 16వ తేదీన ప్ర‌సారం కానున్న జ‌బర్ద‌స్త్ షోకు చెందిన ప్రోమోను లేటెస్ట్‌గా విడుద‌ల చేశారు. ఈ ఎపిసోడ్‌కు న‌టుడు స‌త్య‌దేవ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న న‌టించిన గాడ్సే చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ ఎపిసోడ్‌కు ఆయ‌న వ‌చ్చారు. గాడ్సే చిత్రం జూన్ 17వ తేదీన రిలీజ్ కానుంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా ఆ ఎపిసోడ్‌లో ప్ర‌సారం కానున్న స్కిట్స్ గురించి చూపించారు. అందులో ముఖ్యంగా రైజింగ్ రాజు టీమ్ చేసిన స్కిట్ విప‌రీత‌మైన న‌వ్వు తెప్పిస్తోంది. ఈ స్కిట్‌కు గాను అన‌సూయ వారికి వార్నింగ్ ఇచ్చింది.

Dorababu as Anasuya husband Jabardasth latest promo viral
Anasuya

ఇక స్కిట్ విష‌యానికి వ‌స్తే.. కొంద‌రు సెల‌బ్రిటీల ఇళ్ల‌కు టూర్ వేద్దామ‌ని అనుకుంటారు. అందులో భాగంగా అన‌సూయ ఇంటికి వెళ్తారు. అయితే అన‌సూయ పాత్ర‌లో రైజింగ్ రాజు న‌టించాడు. ఇక ఆమె భ‌ర్త పాత్ర‌లో దొర‌బాబు క‌నిపించాడు. అయితే త‌న భ‌ర్త రాముడు లాంటివాడ‌ని.. అలాంటి పాత్ర‌లో దొర‌బాబు చేయ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. అన‌సూయ నొచ్చుకుంది. అంతేకాదు.. ఎక్స్‌ట్రాలు చేస్తే వ‌యొలెన్స్ ఉంటుంద‌ని అన‌సూయ వార్నింగ్ ఇచ్చింది. ఇక స్కిట్‌లో భాగంగా అన‌సూయ పాత్ర‌లో ఉన్న రాజు చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రోమో వైర‌ల్‌గా మారింది. ఇక వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్‌లో రాజు స్కిట్‌లో న‌వ్వుల పువ్వులు పూయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now