బింబిసార మూవీని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా ?

August 19, 2022 2:16 PM

గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల‌ కలెక్ష‌న్స్ దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు యూనియన్ సమ్మె అని కొన్ని రోజులు, ఇప్పుడేమో నిర్మాతలు షూటింగ్ నిలిపివేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ శుక్రవారం విడుదలైన సీతారామం, బింబిసార బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం మార్నింగ్ షో నుంచి సానుకూల మౌత్ టాక్ రావడంతో పాటు బి & సి సెంటర్లలో భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ తరుణంలో ఈ సినిమా నిజానికి మాస్ మాహారాజ్ రవితేజదేనని టాక్ వినిపిస్తోంది.

do you know who rejected bimbisara movie first

ఒకప్పుడు రవితేజ పోకిరి, పటాస్‌ వంటి చిత్రాలను తిరస్కరించాడు. రవితేజ వదులుకున్న చాలా సినిమాలు చివరికి బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. మొదట దర్శకుడు వశిష్ట ఈ కథను రవితేజకు వివరించాడని, అయితే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం వల్ల అతని కెరీర్‌పై పెద్ద ప్రభావం పడుతుందని భావించిన మాస్ హీరోకి అది నచ్చలేదని సమాచారం. అంతేకాకుండా ఒక కొత్త దర్శకుడు భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఎపిసోడ్‌ లను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అనుమానంతో కూడా బింబిసారను ర‌వితేజ‌ వదులుకున్నాడట.

రవితేజ దానిని తిరస్కరించడంతో.. దర్శకుడు కళ్యాణ్‌రామ్‌ ను కలిశాడని, తన సొంత సంస్థ అన్ని విజువల్ ఎఫెక్ట్‌ లను నిర్వహించగలదని కళ్యాణ్ రామ్ నమ్మాడట. అలాగే బింబిసార పాత్ర చాలా ఆసక్తికరంగా ఉందనే నమ్మకంతో నందమూరి హీరో ఈ సినిమాను చేశాడు. స్క్రిప్ట్, దర్శకుడిపై కళ్యాణ్‌రామ్‌ కు ఉన్న నమ్మకం ఇప్పుడు వర్క్‌ అవుట్ అయినట్లు కలెక్షన్స్ ను చూస్తే అర్ధమవుతోంది. దీంతో రవితేజ మూవీ లిస్ట్ లో మరో సూపర్ హిట్ మిస్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ వరుస పరాజయాలతో.. ఓ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now