Ramya Krishna : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, రమ్యకృష్ణ, సౌందర్య ఫీమేల్ లీడ్ లుగా అప్పట్లో వచ్చిన నరసింహ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అందరికన్నా రమ్యకృష్ణ పాత్రకే ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే వాస్తవానికి ఈ పాత్రకు ముందుగా రమ్యకృష్ణను అనుకోలేదట. అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ కోసమే ఈ పాత్రను తీర్చిదిద్దారట. కానీ దాన్ని ఆమె వదులుకుంది. దీంతో ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ క్రమంలోనే రమ్యకృష్ణకు బాగా పేరువచ్చింది. ఇక ఈ పాత్రను వదులుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే..
సాధారణంగా ఒక సినిమా కథను రాసుకునే ముందు అందులో ఉన్న పాత్రలకు ఫలానా వారు అయితేనే సరిగ్గా సరిపోతారు.. అని దర్శకులు భావిస్తారు. అన్నీ కుదిరి వాళ్ళు కూడా డేట్స్ అడ్జస్ట్ చేసిన తర్వాతే సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు అనుకున్న వాళ్ళు దొరకకపోయినా దొరికిన వాళ్ళతోనే సినిమా చేస్తారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మీనా గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మీనాను దృష్టిలో పెట్టుకొని రాసిన మంచి మంచి క్యారెక్టర్లను మీనా.. తన తల్లి మాట విని నో చెప్పారట.
అందులో ఒకటి నిన్నేపెళ్లాడతా సినిమా. అందులో హీరోయిన్ టబు క్యారక్టర్ కోసం కృష్ణవంశీ ముందుగా మీనాను అనుకున్నారట. కానీ మీనా తల్లి నో చెప్పడంతో మీనా ఆ ఆఫర్ ను వదులుకున్నారట. రెండోది రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర. అందులో ముందుగా మీనాను అనుకున్నారట. కానీ నీలాంబరి పాత్రకు కూడా మీనా తల్లి నో చెప్పారట. దీంతో మీనా నరసింహ మూవీని కూడా వదులుకున్నారు.
ఇక అప్పట్లో మీనా.. తన తల్లి మాటకు కట్టుబడి, గౌరవం ఇచ్చి.. తన తల్లి చెప్పిన నిర్మాతలకు డేట్స్ అడ్జస్ట్ చేసేవారట. తనకు ఇష్టం లేకపోయినా కూడా తన తల్లి మాటకు మీనా ఓకే చెప్పేవారట. అయితే ముందుగా నరసింహ మూవీలో నీలాంబరి పాత్రకు ముందుగా మీనాను అనుకున్నా కానీ.. అందులో ఆమె చేయకపోవడంతో ఆ అవకాశం రమ్యకృష్ణకు దక్కింది. ఈ క్రమంలోనే మూవీ చూసిన అనంతరం నీలాంబరి పాత్రలో ఇంకో హీరోయిన్ చేసి ఉంటే సెట్ అయ్యేది కాదని.. ఆ పాత్రకు రమ్యకృష్ణనే సరిగ్గా సరిపోయారని.. మరే హీరోయిన్ కూడా పాత్రకు సెట్ అయి ఉండేది కాదని.. అప్పట్లో ప్రేక్షకులు అన్నారు. అలా నీలాంబరి పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది యాదృచ్ఛికమో.. మరొకటో తెలియదు కానీ.. నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణనే సరిగ్గా సెట్ అయ్యారని చెప్పవచ్చు. మీనా వదులుకున్న ఆ అవకాశంతో రమ్యకృష్ణ ఎంతగానో పేరు తెచ్చుకున్నారు. దానికి మరెవరూ న్యాయం చేయలేకపోయేవారనే చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…