Vasundhara : బాలకృష్ణ భార్య వసుంధరకు ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

August 20, 2022 9:41 PM

Vasundhara : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరున్న హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య సినిమాలకు దగ్గరగా ఉన్నా.. ఆయన భార్య వసుంధర మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

బాలయ్య భార్య గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు. అయితే బాలయ్య సినిమాలలో ఆమెకు ఇష్టమైన సినిమా చెన్నకేశవరెడ్డి కావడం గమనార్హం. చెన్నకేశవరెడ్డి డైరెక్టర్ వివి వినాయక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య తండ్రి, కొడుకు పాత్రల్లో నటించారు. అయితే వసుంధరకు మాత్రం కొడుకు పాత్ర కంటే తండ్రి పాత్రే ఎంతో ఇష్టమట. చెన్నకేశవరెడ్డి షూట్ సమయంలో బాలయ్య ఎంతో ఉత్సాహంగా ఉండేవారని వసుంధర వినాయక్ తో అన్నారట.

do you know which movie Vasundhara like very much of Balakrishna
Vasundhara

అయితే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. స్టార్ హీరో అయినప్పటికీ బాలయ్య నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లలో అఖండను మించి బ్లాక్ బస్టర్ హిట్లు కొడతారో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now