Actors : ప్రస్తుత తరుణంలో టాలీవుడ్ హీరోలు చాలా మంది ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ భారీగానే ఉంటోంది. గతంలో ఒక్క సినిమాను నిర్మిస్తే అయ్యేంత బడ్జెట్‌నే ఇప్పుడు హీరోలు ఒక్క సినిమాకు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు. అందువల్ల ప్రస్తుతం సినిమా తీయాలంటే.. కనీసం రూ.100 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక మీడియం సైజ్ నుంచి తక్కువ మార్కెట్ ఉన్న హీరోలకు అయితే రూ.50 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఒక్క సినిమాకు పెట్టాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం నిర్మాతలకు సినిమా తీయాలంటే తలకు మించిన భారంగా మారింది.
మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోతున్నారు. దీంతో అన్ని కోట్లు పెట్టి సినిమాను తీసినా ప్రేక్షకులు రాకపోతే అంతే. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. పెరిగిన టిక్కెట్ల ధరలతోపాటు ఓటీటీల ప్రభావం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కన్నా ఓటీటీల్లో చూడడమే ఎంతో మేలని భావిస్తున్నారు. దీంతో సినిమాలకు ప్రస్తుతం కలెక్షన్లు దారుణంగా వస్తున్నాయి. అయితే సినిమా ఫ్లాప్ అయితే కొందరు హీరోలు పారితోషికాన్ని వెనక్కి ఇవ్వరు. కానీ కొందరు మాత్రం ఇస్తున్నారు. ఇక సినిమా ఫ్లాప్ అయితే ఎవరెవరు తమ పారితోషికాలను వెనక్కి ఇచ్చేస్తారు.. అన్న లిస్ట్‌లో కొందరు హీరోల పేర్లను మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వారు ఎవరంటే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను నటించే సినిమాలకు భారీగానే తీసుకుంటారు. అయితే మూవీ ఫ్లాప్ అయితే తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో 40 శాతం వెనక్కి ఇచ్చేస్తారట. ఇక మహేష్ బాబు అయితే తన సినిమా ఫ్లాప్ అయితే సగం రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చేస్తారట.
జూనియర్ ఎన్‌టీఆర్ కూడా తన సినిమా ఫ్లాప్ అయితే దానికి తీసుకున్న రెమ్యునరేషన్‌లో సగం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారని పేరుంది. ఇక రామ్ చరణ్ తేజ అయితే తన సినిమా ఫ్లాప్ అయితే తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో 30 శాతాన్ని వెనక్కి ఇచ్చేస్తారట. దీంతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు అయ్యే నష్టాన్ని కూడా ఆయన భరిస్తారట.
ఇలా కొందరు హీరోలు తమ సినిమా ఫ్లాప్ అయితే పారితోషికంలో ఎంతో కొంత వెనక్కి ఇచ్చేస్తారు. ఇక చిరంజీవి, రజనీకాంత్ వంటి వారు ఫ్లాప్ అయిన మూవీకి పారితోషికం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారని పేరుంది. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ 20 శాతం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారట. ఇక బాలకృష్ణ కూడా సగం పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. అయితే హీరోయిన్లు చాలా మంది ఇలా ఇవ్వరు. కానీ సాయిపల్లవి మాత్రం తన మూవీ ఫ్లాప్ అయితే మొత్తం పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేస్తుందని పేరుంది. ఆమె క్యారెక్టర్‌లో మాత్రమే కాదు.. ఇలాంటి విషయాల్లోనూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…