---Advertisement---

Actors : సినిమా ఫ్లాప్‌ అయితే.. ఏయే హీరోలు పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేస్తారో తెలుసా ?

August 2, 2022 7:16 AM
---Advertisement---

Actors : ప్రస్తుత తరుణంలో టాలీవుడ్‌ హీరోలు చాలా మంది ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ భారీగానే ఉంటోంది. గతంలో ఒక్క సినిమాను నిర్మిస్తే అయ్యేంత బడ్జెట్‌నే ఇప్పుడు హీరోలు ఒక్క సినిమాకు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు. అందువల్ల ప్రస్తుతం సినిమా తీయాలంటే.. కనీసం రూ.100 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక మీడియం సైజ్‌ నుంచి తక్కువ మార్కెట్‌ ఉన్న హీరోలకు అయితే రూ.50 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఒక్క సినిమాకు పెట్టాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం నిర్మాతలకు సినిమా తీయాలంటే తలకు మించిన భారంగా మారింది.

మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోతున్నారు. దీంతో అన్ని కోట్లు పెట్టి సినిమాను తీసినా ప్రేక్షకులు రాకపోతే అంతే. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. పెరిగిన టిక్కెట్ల ధరలతోపాటు ఓటీటీల ప్రభావం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కన్నా ఓటీటీల్లో చూడడమే ఎంతో మేలని భావిస్తున్నారు. దీంతో సినిమాలకు ప్రస్తుతం కలెక్షన్లు దారుణంగా వస్తున్నాయి. అయితే సినిమా ఫ్లాప్‌ అయితే కొందరు హీరోలు పారితోషికాన్ని వెనక్కి ఇవ్వరు. కానీ కొందరు మాత్రం ఇస్తున్నారు. ఇక సినిమా ఫ్లాప్‌ అయితే ఎవరెవరు తమ పారితోషికాలను వెనక్కి ఇచ్చేస్తారు.. అన్న లిస్ట్‌లో కొందరు హీరోల పేర్లను మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వారు ఎవరంటే..

do you know which Actors return remuneration if movie flops
Actors

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాను నటించే సినిమాలకు భారీగానే తీసుకుంటారు. అయితే మూవీ ఫ్లాప్‌ అయితే తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో 40 శాతం వెనక్కి ఇచ్చేస్తారట. ఇక మహేష్‌ బాబు అయితే తన సినిమా ఫ్లాప్‌ అయితే సగం రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చేస్తారట.

జూనియర్‌ ఎన్‌టీఆర్‌ కూడా తన సినిమా ఫ్లాప్‌ అయితే దానికి తీసుకున్న రెమ్యునరేషన్‌లో సగం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారని పేరుంది. ఇక రామ్‌ చరణ్‌ తేజ అయితే తన సినిమా ఫ్లాప్‌ అయితే తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో 30 శాతాన్ని వెనక్కి ఇచ్చేస్తారట. దీంతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు అయ్యే నష్టాన్ని కూడా ఆయన భరిస్తారట.

ఇలా కొందరు హీరోలు తమ సినిమా ఫ్లాప్‌ అయితే పారితోషికంలో ఎంతో కొంత వెనక్కి ఇచ్చేస్తారు. ఇక చిరంజీవి, రజనీకాంత్‌ వంటి వారు ఫ్లాప్‌ అయిన మూవీకి పారితోషికం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారని పేరుంది. అలాగే దర్శకుడు త్రివిక్రమ్‌ 20 శాతం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారట. ఇక బాలకృష్ణ కూడా సగం పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. అయితే హీరోయిన్లు చాలా మంది ఇలా ఇవ్వరు. కానీ సాయిపల్లవి మాత్రం తన మూవీ ఫ్లాప్ అయితే మొత్తం పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేస్తుందని పేరుంది. ఆమె క్యారెక్టర్‌లో మాత్రమే కాదు.. ఇలాంటి విషయాల్లోనూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now