ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక చోట్ల ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక చోట్ల కోటానుకోట్ల నల్లధనం బయట పడుతోంది. రూ.500, రూ.2వేల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా లభిస్తున్నాయి. చాలా మంది మోసం చేసి లేదా నేరాలు చేసి నల్లధనాన్ని వెనకేస్తున్నారు. అలాంటి డబ్బు మొత్తం ED దాడుల్లో పట్టుబడుతోంది. ఈ మధ్యే కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో ED దాడులు చేసి రూ.17 కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకుంది.
ఇక ఇటీవలే బెంగాల్ మంద్రి ఇంట్లో రూ.27 కోట్ల నల్లధనం, బంగారు ఆభరణాలు లభించాయి. వాటన్నింటినీ ED అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు కేసులు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ED దాడుల్లో లభించిన మొత్తం రూ.1 లక్ష కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇలా దాడుల్లో పట్టుబడిన నల్లధనం లేదా బంగారం వంటి వాటిని ఏం చేస్తారు ? అనే ప్రశ్న చాలా మందికి ఉత్పన్నం అవుతుంటుంది. అయితే అలాంటి డబ్బును లేదా విలువైన వస్తువులను ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఎక్కడైనా సరే మనీ లాండరింగ్ లేదా నల్లధనం దాచి ఉంచారని, నేరం చేశారని, అక్రమంగా ధనం, విలువైన వస్తువులను కలిగి ఉన్నారని సమాచారం అందితే.. ఈడీ లేదా సీబీఐ లేదా ఐటీ శాఖ అధికారులు దాడులు చేయవచ్చు. ఇక ఆ దాడుల్లో పట్టుబడిన డబ్బును లేదా ఆభరణాల వంటి విలువైన వస్తువులను సీజ్ చేస్తారు. ఆ డబ్బు, వస్తువులు అన్నీ సంబంధిత శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఆ వివరాలను కోర్టులో అందజేస్తారు.
అయితే కేసు విచారణ జరిగి నిందితులు దోషులు అని తేలితే.. వారి నుంచి అంతకు ముందు స్వాధీనం చేసుకున్న నల్లధనం లేదా విలువైన వస్తువులను ఏవి ఉన్నా సరే వాటిని చట్ట ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు. అప్పుడు కేంద్రం వాటిని సంక్షేమ పథకాలకు లేదా అభివృద్ధి కోసం వాడుతుంది. ఇక దోషులు ఒక వేళ బ్యాంకు మోసానికి పాల్పడి ఉంటే.. వారు బ్యాంకులకు ఏమైనా బకాయి ఉంటే.. అప్పుడు అలా స్వాధీనం చేసుకున్న సొమ్ము లేదా వస్తువులను బ్యాంకులకు అప్పు కింద జమ చేస్తారు. దీంతో బ్యాంకులకు అప్పులు తీర్చినట్లు అవుతుంది.
అయితే ఒక వేళ అధికారులు పెట్టిన కేసులు నిలబడక నిందితులు నిర్దోషులు అని తేలితే మాత్రం అధికారులు తమ అటాచ్‌మెంట్‌లో లేదా ఆధీనంలో ఉంచుకున్న ధనం, వస్తువులు అన్నింటినీ మళ్లీ వెనక్కి ఇచ్చేయాలి. ఇలా ఈ వ్యవస్థ కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈడీ దాడుల్లో భారీ మొత్తంలో నల్లధనం బయట పడుతుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…