Sirivennela : సిరివెన్నెల కుమారుడు రాజా గురించి ప‌లు ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

December 2, 2021 8:40 AM

Sirivennela : సినీ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన కొడుకులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. సిరివెన్నెలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యోగేశ్వర్, చిన్న కుమారుడు రాజా. పెద్ద కుమారుడు యోగేశ్వర్ తన తండ్రి మాదిరిగానే సాహిత్యంపై మక్కువ ఉండడంతో ఆయన సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక చిన్న కుమారుడు రాజా నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Sirivennela : కేక అనే చిత్రం ద్వారా పరిచయం

సిరివెన్నెల తన కొడుకు రాజా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందాలని భావించారు. ఈ క్రమంలోనే రాజా హీరోగా కేక అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో చాలా సంవత్సరాల తర్వాత తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అనే యూత్ ఫుల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకోవాలంటే కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రలలో అయినా చేయవచ్చని భావించారు.

Do you know these things about Sirivennela son Raja
Do you know these things about Sirivennela son Raja

ఇక‌ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించారు. అలాగే ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ అన్నయ్యగా నటించి అందరి అభిమానం పొందారు. ఇలా ఇండస్ట్రీలో అంతరిక్షం, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక ఈయన సినిమాల‌లోనే కాకుండా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now