Vignesh Shivan : విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార దంప‌తుల ఉమ్మ‌డి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

June 24, 2022 2:17 PM

Vignesh Shivan : స్టార్ క‌పుల్ విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార ఎట్ట‌కేల‌కు వివాహం చేసుకున్నారు. జూన్ 9వ తేదీన వీరి వివాహం మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే వీరి వివాహ వేడుక‌కు షారూఖ్ ఖాన్‌, ర‌జ‌నీకాంత్ వంటి ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. ఇక ప్ర‌స్తుతం వీరు హ‌నీమూన్ కోసం థాయ్ లాండ్ వెళ్లారు. అక్క‌డ తాము తీసుకున్న ఫొటోల‌ను వీరు ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తున్నారు.

ఇక న‌య‌న‌తార ఎంతో కాలం నుంచి లేడీ సూప‌ర్ స్టార్‌గా కొన‌సాగుతుండ‌గా.. అటు విగ్నేష్ శివ‌న్ కూడా ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే వీరి ఆస్తుల విలువ గురించి బాలీవుడ్ మీడియా అనేక క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తోంది. ఆ క‌థ‌నాల ప్ర‌కారం.. విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార‌ల ఉమ్మ‌డి ఆస్తి విలువ రూ.270 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది.

do you know the total asset value of Vignesh Shivan and Nayanthara
Vignesh Shivan

న‌య‌న‌తార హీరోయిన్‌గా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. క‌నుక స‌హ‌జంగానే ఆమె సంప‌ద ఎక్కువగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే న‌య‌న‌తార‌కు ఆస్తులు భారీగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఈమెకు ఒక ప్రైవేట్ జెట్‌తోపాటు ప‌లు బీఎండ‌బ్ల్యూ కార్లు, మెర్సిడిస్ బెంజ్ కార్లు ఉన్నాయ‌ట‌. అఆగే చెన్నైలో ప‌లు క‌మర్షియ‌ల్ ప్రాప‌ర్టీలు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో ఆమె ఆస్తి విలువే రూ.170 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ ఆస్తి విలువ రూ.100 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. విగ్నేష్ శివ‌న్‌.. న‌య‌న‌తార‌లా అంత పాపుల‌ర్ కాదు. కానీ ఆస్తి మాత్రం బాగానే ఉంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రి ఆస్తి క‌లిపి రూ.270 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక న‌య‌న‌తార ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ మూవీ జ‌వాన్‌లో న‌టిస్తోంది. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆమె ఈ షూటింగ్‌లో పాల్గొన‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now