Baahubali : దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. బాహుబలి మొత్తం రెండు పార్ట్‌లుగా వచ్చింది. ఈ క్రమంలోనే మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్‌కే ఎక్కువ ఆదరణ లభించింది. అందరూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని చెప్పి ఈ సినిమాను చూశారు. ఇక రెండు పార్ట్‌లకు కలిపి మొత్తం రూ.430 కోట్ల బడ్జెట్ కాగా.. ఈ మూవీలకు గాను అందులో నటించిన వారు ఎంత మొత్తం రెమ్యునరేషన్‌ను అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బాహుబలి మొదటి పార్ట్‌కు రూ.180 కోట్లు, రెండో పార్ట్‌కు రూ.250 కోట్లు అయింది. అయితే ఈ మూవీకి గాను నటీనటుల కన్నా దర్శకుడు రాజమౌళికే ఎక్కువ మొత్తం ఇచ్చారు. ఆయన రూ.28 కోట్లతోపాటు లాభాల్లో మూడో వంతు వాటాను తీసుకున్నారు. దీంతో ఆయన పెద్ద మొత్తమే వెనకేశారు. ఇక ప్రభాస్ రూ.25 కోట్లు, రానా రూ.15 కోట్లు, అనుష్క రూ.5 కోట్లు, తమన్నా రూ.5 కోట్లు, రమ్య కృష్ణ రూ.2.50 కోట్లు, సత్యరాజ్ రూ.2 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకున్నారు.
ఇక బాహుబలి మూవీ ద్వారా ప్రభాస్, రానా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో పేరుగాంచారు. దీంతో తరువాత తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌కు మంచి పేరు వచ్చింది. అయితే బాహుబలి మూవీ రెండు పార్ట్‌లు కలిపి రూ.2వేల కోట్ల మేర గ్రాస్‌ను వసూలు చేసిందని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…