Baahubali : బాహుబలి రెండు మూవీలకు ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌.. తదితర నటీనటులకు ఎంత మొత్తం ఇచ్చారో తెలుసా..?

September 20, 2022 3:14 PM

Baahubali : దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. బాహుబలి మొత్తం రెండు పార్ట్‌లుగా వచ్చింది. ఈ క్రమంలోనే మొదటి పార్ట్‌ కన్నా రెండో పార్ట్‌కే ఎక్కువ ఆదరణ లభించింది. అందరూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని చెప్పి ఈ సినిమాను చూశారు. ఇక రెండు పార్ట్‌లకు కలిపి మొత్తం రూ.430 కోట్ల బడ్జెట్‌ కాగా.. ఈ మూవీలకు గాను అందులో నటించిన వారు ఎంత మొత్తం రెమ్యునరేషన్‌ను అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బాహుబలి మొదటి పార్ట్‌కు రూ.180 కోట్లు, రెండో పార్ట్‌కు రూ.250 కోట్లు అయింది. అయితే ఈ మూవీకి గాను నటీనటుల కన్నా దర్శకుడు రాజమౌళికే ఎక్కువ మొత్తం ఇచ్చారు. ఆయన రూ.28 కోట్లతోపాటు లాభాల్లో మూడో వంతు వాటాను తీసుకున్నారు. దీంతో ఆయన పెద్ద మొత్తమే వెనకేశారు. ఇక ప్రభాస్‌ రూ.25 కోట్లు, రానా రూ.15 కోట్లు, అనుష్క రూ.5 కోట్లు, తమన్నా రూ.5 కోట్లు, రమ్య కృష్ణ రూ.2.50 కోట్లు, సత్యరాజ్‌ రూ.2 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకున్నారు.

do you know the remunerations of Baahubali stars
Baahubali

ఇక బాహుబలి మూవీ ద్వారా ప్రభాస్‌, రానా పాన్‌ ఇండియా స్టార్స్‌ అయ్యారు. దర్శకుడు రాజమౌళి పాన్‌ ఇండియా స్థాయిలో పేరుగాంచారు. దీంతో తరువాత తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌కు మంచి పేరు వచ్చింది. అయితే బాహుబలి మూవీ రెండు పార్ట్‌లు కలిపి రూ.2వేల కోట్ల మేర గ్రాస్‌ను వసూలు చేసిందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now