Aditya 369 : బాలయ్య నటించిన ఆదిత్య 369 మూవీలో.. ఆ 369 అనే నంబర్ లో అంత‌ అర్థం ఉందా..!

August 29, 2022 5:47 PM

Aditya 369 : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన  హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది.

ఆదిత్య 369, భైరవ దీపం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడంలో కూడా బాలయ్యకు సరిసాటి ఎవరూ లేరు. బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఆదిత్య 369 సినిమా ఒకటి అని చెప్ప‌వచ్చు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించి తన నట విశ్వరూపం చూపించారు. సరైన సదుపాయాలు, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సరిగ్గా లేని టైంలో ప్రయోగాత్మక సినిమాలు చేయటం అంటే పెద్ద రిస్క్ తో కూడిన పని. అలాంటి సమయంలోనే బాలయ్య టైం మిషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో నటించి తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి చాటి చెప్పారు.

do you know the meaning of 369 in Aditya 369 movie
Aditya 369

ఆదిత్య 369 చిత్రాన్ని సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు  తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్‌లో 369 అనే నెంబర్ ఎందుకు ఉందో ఎవరికీ అర్థం కాలేదు ఆ రోజుల్లో. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఈ 369 నంబర్ గురించి ప్రశ్న ఎదుర్కొన్నారు. దీంతో బాలయ్య ఆదిత్య అంటే సూర్యుడు అని ఎంతో చక్కగా సమాధానం ఇచ్చారు. ఇక 369 నంబర్ గురించి చెబుతూ ఇది ఒక స్పెషల్ నెంబర్ అని చెప్పారు.

అయితే ఆ నంబర్ ఎలా వచ్చింది దాని అర్థం ఏంటన్నది మాత్రం బాలయ్య కూడా చెప్పలేదు. అయితే 369 అనే నంబర్ వెనక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే 369 అంటే పాజిటీవిటీ అన్న మీనింగ్ ఉంది. ఆదిత్య369 చిత్రంలో 3 అంటే మార్పు, 6 అంటే కొత్త ఆరంభం అని ఆర్థం. ఇక 9 అంటే విస్త‌రించ‌డం అనే అర్థం వ‌స్తుంద‌ట‌. గ‌డియారంలో కూడా 369 అనే నెంబ‌ర్ కు స‌రి స‌మాన‌మైన కాలాన్ని సూచిస్తుంది. సంఖ్యా శాస్త్ర ప్ర‌కారం కూడా ఇది చాలా ల‌క్కీ నెంబ‌ర్ అని అంటారు. అదే విధంగా 3+6=9, 9 అనేది చాలా మంది సెలబ్రెటీల‌కి లక్కీనంబర్ గా భావిస్తారు. క‌నుక‌నే ఆ నంబ‌ర్ ను టైటిల్‌లో పెట్టిన‌ట్లు వివ‌రించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now