Manchu Lakshmi : ఇంగ్లీష్ సీరియ‌ల్స్‌లో యాక్ట్ చేసిన మంచు వార‌మ్మాయి.. ఈ విష‌యం మీకు తెలుసా?

October 22, 2021 4:51 PM
do you know that Manchu Lakshmi  acted in hollywood series

Manchu Lakshmi : టాలీవుడ్ క్రేజీ నటి మంచు లక్ష్మీ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ ఉంటూ అభిమానులతో చేరువగా ఉంటోంది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో ఓ ఇంగ్లీష్ సినిమాలో నటించింది. టాలీవుడ్ కి సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. అయితే అక్కడ అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ తెలుగులోనే తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇలా టాలీవుడ్, బాలీవుడ్ తోపాటు మంచు లక్ష్మీ ఇంగ్లీష్ సీరియల్స్ కూడా యాక్ట్ చేసింది. ప్రజంట్ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ విషయం చాలామందికి తెలియదు. మంచు లక్ష్మీ ఇంగ్లీష్ సీరియల్స్ లో 2004 నుండి 2008 వరకు ఏకంగా నాలుగు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. మళ్ళీ హాలీవుడ్ కి వెళ్ళే అవకాశం రాలేదు. అందుకే టాలీవుడ్ లోనే బుల్లితెర యాంకర్ గా వర్క్ చేసింది. లేటెస్ట్ గా అల్లు అరవింద్ సొంత ఓటీటీలో కూడా మంచు లక్ష్మీ కుకింగ్ షోతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. అలాగే ఆమెకు ఫిజికల్ ఫిట్ నెస్ మీద కూడా మంచి గ్రిప్ ఉందని చెప్పుకోవచ్చు.

తన విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. మంచు లక్ష్మీ కూతురుతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని కూడా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. హోమ్ టూర్ లాంటి వీడియోస్ తోపాటు యూట్యూబ్ ఛానల్ లో కూడా రకరకాల వీడియోస్ చేస్తుంది. వీటితోపాటు ఆమె ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. మంచు లక్ష్మీ తన స్లాంగ్ అండ్ లాంగ్వేజ్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అది మంచు లక్ష్మీ స్పెషాలిటీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now