Telugu Heroes : 50, 60 ఏళ్ళు వచ్చినా స్టార్ హీరోలందరూ అంతే అందంగా, ఆకర్షణీయంగా, ఫుల్ ఫిట్‌నెస్‌తో కనిపిస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అయితే ఇంకా యవ్వనంగా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తుంటాడు. ఇందుకు కారణం వాళ్లు తీసుకునే ఆహారమనే చెప్పొచ్చు. ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోలు.. ఏ హీరో ఏ వంటకాన్ని ఇష్టంగా తింటారో చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే చాలా ఇష్టమట. సీ ఫుడ్ తోపాటు చిరు దోశలను కూడా ఇష్టంగా తింటాడట.
బాలయ్య బాబు కూడా రొయ్యలను బాగా ఇష్టపడతారట. అలాగే చికెన్ బిర్యానీ కూడా బాలయ్యకి ఫేవరెట్ ఫుడ్. అయితే ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతం ఫుడ్ ని ఆస్వాదించడం బాలయ్యకి అలవాటు. విక్టరీ వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఎక్కువగా ఇష్టపడతారట. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకొని నోస్టాలజిక్ కీమాను తినడమంటే వెంకీకి బాగా ఇష్టమట. 6 పదుల వయసులో కూడా అందంగా కనిపించే కింగ్ నాగార్జున దోశ, చేపలు, గ్రిల్ట్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. సీ ఫుడ్ తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ తో పాటు గ్రేట్ చెఫ్ కూడా. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి కీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటారట. రామ్ చరణ్ కి కూడా ఫెవరేట్ ఫుడ్ బిర్యానీనే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరెట్ అంట. అయితే బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు. మహేష్ బాబు వాళ్ళ అమ్మమ్మ చేసే ప్రతి వంటనూ ఎంతో ఇష్టంగా తినేవారట. ప్రస్తుతం మహేష్ ఇష్టమైన వంటకాలను డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…