Vijay Devarakonda : సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కించినప్పటికీ విజయం సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేరు. కానీ ఒక సినిమా విజయం కంటే పరాజయమే ఒక నటుడికి జీవితంలో గుణపాఠాలు నేర్పుతుందని చెబుతారు. ఒక చిత్ర పరాజయం దానిలో పని చేసిన వారందరిపై ప్రభావం చూపుతుంది. కాగా హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా లైగర్ సినిమా ఫ్లాప్ అవడం ఇదే విధంగా మార్పు తీసుకొచ్చిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. లైగర్ తో పాన్ ఇండియా స్టార్ అవుదామనుకున్న విజయ్ కి ఒక విధంగా ఈ సినిమా పరాజయం మేలు చేసిందనే అంటున్నారు.
లైగర్ ఘోరంగా విఫలం అవడంతో పూరీ జగన్నాథ్ తో తన తదుపరి సినిమా అయిన జన గణ మన గురించి మాట్లాడటానికి విజయ్ దేవర కొండ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చాలా ఏళ్లుగా జన గణ మన చిత్రం పూరీ కలల ప్రాజెక్ట్ గా ఉన్న విషయం ఇది వరకే తెలుసు. ఎంతో మంది హీరోలతో అనుకున్నప్పటికీ చాలా కాలం ఎదురుచూసిన తరువాత చివరకు విజయ్ దేవరకొండతో చేయడానికి సిద్ధమయ్యారు. షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకోవడం జరిగింది.
అయితే ప్రస్తుతం సైమా అవార్డ్స్ వేడుకల్లో పాలుపంచుకుంటున్న విజయ్ ని ఈ సినిమా గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన స్పందిస్తూ.. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్లమని వారికి సూచించడం జరిగింది. దీంతో ఇక ఇప్పట్లో జన గణ మన సినిమా లేనట్లేనని భావిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ కూడా ఎవరూ ఈ విషయంపై స్పదించకపోవడంతో ఆ సినిమా ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…