Akhanda Movie : బాలయ్య అఖండ మూవీలో న‌టించిన‌ ఈ నటి ఎవరో తెలుసా..?

August 28, 2022 11:39 AM

Akhanda Movie : నట సింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. సినిమా రిలీజ్ కి ముందే జై బాలయ్య పాట హిట్ కావడం, ట్రైలర్‌లో కూడా బాలయ్య మార్కు ఉండడంతో అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు త‌గ్గట్టే అందరి అంచనాల‌ను మూవీ రీచ్ అయ్యింది. థమన్ బాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య అఖండ, రామకృష్ణ అనే డ్యూయల్ రోల్ ప్లే చేశారు. బాలయ్య యాక్షన్ సీన్స్ లో ఇరగదీశాడు. అఖండ సినిమాతో చాలా కాలం తరువాత నటుడు శ్రీకాంత్ మరలా విలన్ గా పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద‌ని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో నటి నవీన రెడ్డి కీలక పాత్రలో నటించింది. నవీనా రెడ్డి స్క్రీన్ పై కనిపించింది తక్కువసేపు అయినా కీ రోల్ పోషించింది. నవీన రెడ్డి ఇంతకు ముందు ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించింది. అలాగే వెంకీ మామ, అతిథి దేవోభవ, హిట్, డియర్ మేఘన, చేరువైన దూరమైన వంటి చిత్రాల్లో నటించింది నవీన రెడ్డి. అయితే ఈ సినిమాలతో రాని గుర్తింపు నవీన రెడ్డికి అఖండతో వచ్చిందని చెప్పవచ్చు.

do you know Naveena Reddy in Akhanda Movie
Akhanda Movie

ఇదిలా ఉండగా నవీన రెడ్డి పక్కా హైదరాబాదీ కాగా ఆమెకు మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం. చిరు కరోనా బారిన పడిన సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయడం విశేషం. నవీన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాల అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది. అలాగే ఆ మధ్య రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కూడా పాల్గొంది నవీన రెడ్డి. అఖండ విజయంతో ఈ అమ్మడు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now