Anasuya : పుష్ప సినిమా కోసం అన‌సూయ అంత రెమ్యున‌రేష‌న్ అందుకుందా ?

December 23, 2021 3:21 PM

Anasuya : టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ న‌టిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమాతో ఆమె స్థాయి ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. తాజాగా పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అనసూయ ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాకు అనసూయ ఆ స్థాయిలో పారితోషికం అందుకుంది అనే విషయం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

do you know how much remuneration Anasuya took for pushpa movie

పుష్ప సినిమాలో నెగెటివ్ షేడ్‌లో క‌నిపించేందుకు అన‌సూయ ఒక్కరోజుకే రూ. 1 లక్ష నుంచి రూ.1.50 లక్షల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట. తొలి పార్ట్‌లో అంత‌గా అల‌రించ‌ని అన‌సూయ సెకండ్ పార్ట్‌లో మాత్రం అద‌ర‌గొడుతుంద‌ని తెలుస్తోంది.

అనసూయ భరద్వాజ్ పుష్ప రెండవ భాగంలో కూడా దాక్షాయనిగా మరింత భీభత్సంగా కనిపించనున్నట్లు సమాచారం. సునీల్ క్యారెక్టర్ కు సతీమణిగా అనసూయ పాత్ర రెండవ భాగంలో ఇంకా అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఖిలాడీ చిత్రంలో న‌టించిన అన‌సూయ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన‌ రంగమార్తాండ అనే సినిమా కూడా చేస్తోంది. అలాగే మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వస్తుండడంతో ఆచితూచి అడుగులు వేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now