Pokiri Movie : తెలుగు తెరపై ప్రేక్షకులకు ఓ రాముడిగా, కృష్ణుడిగా ముందు గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. తెలుగు తెరపై రికార్డులు క్రియేట్ చేసిన నందమూరి తారక రామారావు నటుడిగానే కాదు, దర్శకుడిగా కూడా మంచి ప్రతిభను చూపించారు. 1977లో ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం దానవీరశూరకర్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడుగా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
అప్పట్లో ఈ చిత్రం 10 లక్షల రూపాయల కన్నా తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి కోటి రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. మరలా ఈ చిత్రం తిరిగి 17 ఏళ్ల తర్వాత అంటే 1994లో భారీ ఎత్తున విడుదలై 60 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అప్పటి తరంలో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డుని ఈ తరంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి కూడా ఇలాంటి రికార్డునే క్రియేట్ చేసింది.
ఈ ఆగస్టు 9న సాయంత్రం రీ రిలీజ్ చేసిన పోకిరి సినిమా స్పెషల్ ప్రీమియర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయిన పోకిరి చిత్రం ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోనే ఆరు లక్షల రూపాయల వసూళ్లను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. పోకిరి చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 200 థియేటర్ లలో విడుదల చేశారు.
ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం పోకిరి చిత్రం మూడు కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టిందని తెలుస్తోంది. దానవీరశూరకర్ణ తర్వాత మరలా అదే స్థాయిలో పోకిరి చిత్రం రికార్డులను సృష్టించింది. ఈ తరహాలో రీ రిలీజ్ అయిన ఘరానా మొగుడు, తొలిప్రేమ చిత్రాలు కూడా పోకిరి చిత్రం స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయలేకపోయాయి. దీన్ని బట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రానికి ఉన్న సత్తా ఏంటో వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…