పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత జంటగా కలిసి ఎంత సంపాదించారంటే..?

September 2, 2022 9:09 PM

వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా సమంత, నాగచైతన్య జంట ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఏ మాయ చేశావె చిత్రంతో నాగ చైతన్య, సమంత ప్రేమ బంధం మొదలైంది. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో కలిసి నటించిన‌ ఇద్దరి జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. నిజ జీవితంలో పదేళ్లు ప్రేమలో రిలేషన్ కొనసాగించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంత ముచ్చటైన జంట గత ఏడాది అక్టోబర్ లో విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. వీరు విడిపోయి దాదాపుగా పది నెలలు గడుస్తున్నా కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది.

చిత్ర పరిశ్రమలో న‌టీన‌టుల‌కు రెమ్యున‌రేష‌న్ లు భారీగా ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే కుటుంబంలో హీరో హీరోయిన్ ఉంటే వారి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో  ప్రత్యేకించి వివరించ‌నక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిపై మరో విషయం వైరల్ గా మారింది. సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత సంపాదన కూడబెట్టారనే వార్త హల్ చల్ చేస్తోంది.

do you know how much naga chaitanya and samantha earned after marriage

నాగ చైతన్యతో ఉన్నప్పటి కన్నా సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆఫర్ల‌ జోరు పెరిగిందనే చెప్పవచ్చు. విడాకుల తర్వాత సమంత గ్లామర్ డోస్ ను బాగా పెంచింది. నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు, టీవీ షోలు మరియు ప్రకటనల ద్వారా దాదాపు రూ.84 కోట్ల ఆదాయాన్ని సమంత కూడపెట్టిందనే  సమాచారం వినిపిస్తోంది. కేవలం సినిమాలు, టీవీ షోల ద్వారానే కాకుండా సమంత సాకి అనే బ్రాండ్ కు స‌మంత ఓన‌ర్ గా ఉంది. అదే విధంగా రెండు స్టార్ట‌ప్ ల‌ను కూడా ప్రారంభించి అదనపు ఆదాయాన్ని సంపాదించుకుంటోంది.

అక్కినేని వారసుడు నాగచైతన్య పుట్టుకతోనే వేలకోట్లు ఆస్తికి వారసుడు. నాగచైతన్య సమంతని పెళ్లి తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూ రూ.40 కోట్ల వరకు సంపాదనను వెనక వేశాడ‌ట. వీళ్లు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దాదాపు రూ.122 కోట్ల వరకూ సంపాదించారని టాక్ వినిపిస్తోంది. సంపాదన పరంగా సక్సెస్ సాధించిన ఈ జంట నిజ జీవితంలో ఎందుకు ఫ్లాప్ అయ్యారు అనే విషయం మాత్రం అభిమానులకు ఇప్పటికి కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now