Samantha : సమంత విడాకుల పోస్ట్ కు ఎన్ని లైకులు వచ్చాయో తెలుసా ?

October 3, 2021 7:28 PM

Samantha : టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న సమంత, నాగచైతన్య గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం వీరి వివాహ బంధానికి ముగింపు పలుకుతూ నాగచైతన్య, సమంత దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే సమంత షేర్ చేసిన పోస్టుకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.

Samantha : సమంత విడాకుల పోస్ట్ కు ఎన్ని లైకులు వచ్చాయో తెలుసా ?

సమంత తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నోట్ కింద కామెంట్ బాక్స్ ను బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే సమంత చేసిన పోస్ట్ కు పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే సమంత విడాకులు తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు అన్న సందేహం కలుగక మానదు. సమంత వివాహ బంధానికి ముగింపు పలుకుతూ చేసిన పోస్టుకు ఏకంగా 12 లక్షల లైకులు రావడం గమనార్హం.

అయితే సమంత తమ వివాహబంధానికి ముగింపు పలికినా తమ స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్పడంతో ఈ పోస్ట్ ను లైక్ చేశారా.. లేక సమంత విడాకులు తీసుకోవాలని చాలా మంది భావిస్తున్న కారణంగా లైక్‌ కొట్టారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంత విడాకుల విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now