Ram Charan : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ప‌నిచేసే డ్రైవ‌ర్‌కు.. జీతం ఎంతో తెలుసా..?

August 13, 2022 4:36 PM

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి సినీ వారసుడిగా రామ్ చ‌ర‌ణ్‌ తెలుగు తెరకు పరిచయమయ్యారు. చిరుత చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేక పోయినప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రంతో ఘన విజయం సాధించి నటన పరంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మగధీర విజయంతో వరుస ఆఫర్ల‌ను దక్కించుకుంటూ ధృవ, ఎవడు, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ల‌ను అందుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు.  హాలీవుడ్ డైరెక్టర్ లు సైతం చరణ్ తో సినిమాలు చేయాలనే కోరికను కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో Rc15  చిత్రంలో హీరోగా  నటిస్తున్నారు.

do you know about the salary of Ram Charan car driver
Ram Charan

ఇక చిత్రాలలోనే కాదు నిజజీవితంలో కూడా రామ్ చరణ్ ఒక సక్సెస్‌ఫుల్ వ్య‌క్తి అని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది నటులు తమ దగ్గర పనిచేసే స్టాఫ్ ని సొంత వారిలా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా తమకు తోచిన సాయం చేస్తూ వారి దగ్గర పనిచేసే ఉద్యోగులకు అండగా నిలుస్తారు. ఇలా తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు సాయం చేసే స్వభావంలో చరణ్ ముందు ఉంటారు.

చిరంజీవి కూడా కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటికి కూడా ఒకే మేకప్ మ్యాన్ ని తన దగ్గర ఉద్యోగంలో కొనసాగింపు చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన తన బాడీగార్డ్ కి ఆర్థిక సహాయం అందించి తన ఉదార స్వభావం చాటుకుని అందరి మనసుల‌ను గెలుచుకున్నారు. అలా ఉంటుంది మెగాస్టార్ ఫ్యామిలీతో స్టాఫ్ కి అనుబంధం.

ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కు నెలకు 45 వేల రూపాయిలు జీతం ఇస్తారని సమాచారం వినిపిస్తోంది. అయితే కొత్తగా జాయిన్ అయిన  సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీతం కన్నా రామ్ చరణ్ దగ్గర పనిచేసే డ్రైవర్ జీతమే ఎక్కువ అని ఆశ్చర్యపోతూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now