Allu Arjun : అల్లు అర్జున్ ఫిట్ నెస్ ర‌హ‌స్యాలు ఏమిటో తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Allu Arjun : పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు పాన్ ఇండియా స్థాయిలో పేరు వ‌చ్చింది. ఆయ‌న పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు ప‌లువురు బాలీవుడ్ నిర్మాత‌లు, హీరోయిన్స్ ఆస‌క్తిని చూపిస్తున్నారంటే.. ఆయ‌న క్రేజ్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్‌గా తండ్రి, మ‌రోవైపు మెగా ఫ్యామిలీ అండ ఉన్న‌ప్ప‌టికీ అల్లు అర్జున్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

Allu Arjun

అల్లు అర్జున్ త‌న డ్యాన్స్‌, న‌ట‌న‌తోనే ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స్టైల్ స్టార్ అయ్యారు. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారారు. ఇక పుష్ప మూవీ ఆయ‌న‌ను అమాంతం నేష‌న‌ల్ స్టార్‌ను చేసింది. అయితే త‌న కెరీర్ ప్రారంభం నుంచి అల్లు అర్జున్ భిన్న క‌థాంశంతో కూడిన చిత్రాల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. అందులో భాగంగానే సినిమాకు త‌గిన‌ట్లు త‌న శ‌రీరాన్ని మార్చుకుంటున్నారు.

అవ‌స‌రం వ‌స్తే సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించ‌డం లేదా క‌థ‌కు త‌గిన‌ట్లుగా సాధార‌ణ వ్య‌క్తిగా క‌నిపించ‌డం.. ఇలా అల్లు అర్జున్ ఏ క్యారెక్ట‌ర్‌లో అయినా స‌రే ఒదిగిపోతారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ త‌న ఫిట్ నెస్ ప‌ట్ల ఎక్కువ శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తార‌ని చెప్ప‌వ‌చ్చు.

అల్లు అర్జున్ ఫిట్ నెస్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఆయ‌న వారంలో క‌నీసం 3 రోజుల పాటు వ‌ర్క‌వుట్స్ చేస్తారు. చేసిన‌ప్పుడ‌ల్లా ఎక్కువ స‌మ‌యం పాటు జిమ్‌లో గ‌డుపుతారు. అలాగే షూటింగ్స్ లేని స‌మ‌యంలో ఆయ‌న వారానికి క‌నీసం 7 నుంచి 9 సార్లు జిమ్‌లో గ‌డుపుతార‌ట‌. ఇక ఆహారం విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో త‌ప్ప‌క గుడ్లు తీసుకుంటారు. చాక్లెట్స్ అంటే అల్లు అర్జున్‌కు ఎంతో ఇష్టం. రోజుకో చాకోబార్‌ను ఆయ‌న క‌చ్చితంగా తింటార‌ట‌.

శ‌రీరాన్ని దృఢంగా ఉంచుకోవ‌డం కోసం ఆయ‌న క‌ఠిమైన క‌స‌ర‌త్తులు చేస్తార‌ట‌. పుష‌ప్స్‌, చిన్ అప్స్‌, డిప్స్ ను క‌చ్చితంగా చేస్తారు. అలాగే ఖాళీ క‌డుపుతో ట్రెడ్ మిల్‌పై ప‌రుగెడ‌తారు. 45 నిమిషాల పాటు ఆగ‌కుండా ర‌న్నింగ్ చేస్తారు. ఇలా బ‌న్నీ ఫిట్‌నెస్ ప‌రంగా ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటాడు.

ఇక ఒక్కోసారి జంక్ ఫుడ్‌, బ‌య‌టి ఫుడ్ తిన్న‌ప్పుడు జిమ్‌లో కాస్త ఎక్కువ స‌మ‌యం పాటు గడిపి ఆ క్యాల‌రీల‌ను క‌ర‌గదీస్తాడ‌ట‌. ఆయ‌న సినిమాల్లో త‌న పాత్ర కోసం బ‌రువు పెర‌గాలంటే అందుకు త‌గిన విధంగా డైట్ పాటిస్తార‌ట‌. పుష్ప మూవీలో ఆయ‌న కూలీగా క‌నిపించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఆయ‌న జుట్టు, గ‌డ్డం పెంచారు. సినిమా మొత్తం అలాగే ఉంటారు. అలాగే బాగా స‌న్న‌గా అయ్యారు. ఇక పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగా నిల‌వ‌గా.. ఈ మూవీ ఏకంగా రూ.326 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి రికార్డుల‌ను చెరిపివేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM