Pooja Hegde : ఈ మధ్యకాలంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజుల కిందట ఈ అమ్మడు మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్లి రచ్చ రచ్చ చేసింది. బికినీలు ధరించి అందాలను ఆరబోస్తూ ఫొటోలను దిగింది. వాటిని సోషల్ ఖాతాల్లో షేర్ చేసింది. అవి తెగ వైరల్ అయ్యాయి. ఇక ముంబైలో ఈ అమ్మడు ఇటీవలే ఓ కొత్త ఇంటిని కట్టుకుంది. దీంతో ఈ భామ ఫుల్ బిజీగా మారింది.
అయితే పూజా హెగ్డె ఎట్టకేలకు 13 ఏళ్ల తరువాత ఒక పనిని పూర్తి చేసింది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. తాను సినిమాల్లో నటిస్తూ బిజీ కావడం వల్ల ఇప్పటి వరకు ఒంటరిగానే వెకేషన్స్‌కు వెళ్లాల్సి వచ్చిందని.. కానీ 13 ఏళ్ల తరువాత మళ్లీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్నానని చెప్పింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలో తల్లిదండ్రులు, సోదరుడు ఉండడం విశేషం.
ఇక పూజా హెగ్డెకు ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. ఖాళీగానే ఉంటోంది. ఈమె నటించిన రాధేశ్యామ్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈమె ఇటీవలి కాలంలో ఏ చిత్రంలో నటించినా అది హిట్ అవుతోంది. దీంతో ఈమె నిర్మాతల నుంచి భారీ ఎత్తున రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రెమ్యునరేషన్ మాత్రమే అయితే ఓకే. కానీ తన వెంట కొందరు సిబ్బంది వస్తున్నారని.. వారందరి ఖర్చులను కూడా నిర్మాతలే భరించారని.. ఈమె కొత్త కొత్త కండిషన్లు పెడుతున్నదట. దీంతో ఈమెను సినిమాల్లోకి తీసుకుందామంటేనే నిర్మాతలు భయపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో పూజా హెగ్డె భారీగానే సొమ్ము పోగు చేసిందట. తాను ముంబైలో, హైదరాబాద్‌లో రెండు చోట్ల ఇళ్లను కొత్తగా కట్టుకుంది. ఇక త్వరలోనే ఫ్యామిలీ కోసం ముంబైలో ఓ ఇంటిని కట్టబోతుందని తెలిసింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…