Pooja Hegde : 13 ఏళ్ల త‌రువాత ఎట్ట‌కేల‌కు ఆ ప‌ని పూర్తి చేసిన పూజా హెగ్డె..!

February 11, 2022 5:52 PM

Pooja Hegde : ఈ మ‌ధ్య‌కాలంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. గ‌త కొద్ది రోజుల కింద‌ట ఈ అమ్మ‌డు మాల్దీవ్స్‌కు వెకేష‌న్‌కు వెళ్లి ర‌చ్చ ర‌చ్చ చేసింది. బికినీలు ధ‌రించి అందాల‌ను ఆర‌బోస్తూ ఫొటోల‌ను దిగింది. వాటిని సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేసింది. అవి తెగ వైర‌ల్ అయ్యాయి. ఇక ముంబైలో ఈ అమ్మ‌డు ఇటీవ‌లే ఓ కొత్త ఇంటిని క‌ట్టుకుంది. దీంతో ఈ భామ ఫుల్ బిజీగా మారింది.

Pooja Hegde finally completed that work after 13 years of gap
Pooja Hegde

అయితే పూజా హెగ్డె ఎట్ట‌కేల‌కు 13 ఏళ్ల త‌రువాత ఒక ప‌నిని పూర్తి చేసింది. ఆ విష‌యాన్ని ఆమే స్వయంగా తెలిపింది. తాను సినిమాల్లో న‌టిస్తూ బిజీ కావ‌డం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఒంట‌రిగానే వెకేష‌న్స్‌కు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని.. కానీ 13 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్తున్నాన‌ని చెప్పింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలో త‌ల్లిదండ్రులు, సోద‌రుడు ఉండ‌డం విశేషం.

ఇక పూజా హెగ్డెకు ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేవు. ఖాళీగానే ఉంటోంది. ఈమె న‌టించిన రాధేశ్యామ్ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈమె ఇటీవ‌లి కాలంలో ఏ చిత్రంలో న‌టించినా అది హిట్ అవుతోంది. దీంతో ఈమె నిర్మాత‌ల నుంచి భారీ ఎత్తున రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే అయితే ఓకే. కానీ త‌న వెంట కొంద‌రు సిబ్బంది వ‌స్తున్నార‌ని.. వారంద‌రి ఖ‌ర్చుల‌ను కూడా నిర్మాత‌లే భ‌రించార‌ని.. ఈమె కొత్త కొత్త కండిష‌న్లు పెడుతున్న‌ద‌ట‌. దీంతో ఈమెను సినిమాల్లోకి తీసుకుందామంటేనే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇక ఈ మ‌ధ్య కాలంలో పూజా హెగ్డె భారీగానే సొమ్ము పోగు చేసింద‌ట‌. తాను ముంబైలో, హైద‌రాబాద్‌లో రెండు చోట్ల ఇళ్ల‌ను కొత్త‌గా క‌ట్టుకుంది. ఇక త్వ‌ర‌లోనే ఫ్యామిలీ కోసం ముంబైలో ఓ ఇంటిని క‌ట్ట‌బోతుంద‌ని తెలిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now