Shabina : జబర్దస్త్ షోలో ప్రేక్షకులను సందడి చేస్తున్న సొట్ట బుగ్గల చిన్నది షబీనా ఎవరు?

November 18, 2021 8:25 PM

Shabina : జబర్దస్త్ లో ఒకప్పుడు కేవలం కొందరు కమెడియన్స్ మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా వేదికపై ప్రేక్షకులను అలరించేవారు. ఈ కార్యక్రమంలో మగవారు ఆడవారి వేషధారణలో ప్రేక్షకులను సందడి చేస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ఎంతో మంది కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎంతో మంది లేడీ కమెడియన్స్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విశేషమైన ఆదరణ దక్కించుకుంటున్నారు.

do you know about Shabina in jabardasth

తాజాగా కెవ్వుకార్తిక్ టీంలో కుర్రకారును ఆకట్టుకుంటున్న సొట్ట బుగ్గల చిన్నది షబీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందమైన నవ్వుతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈమె ప్రదీప్ పెళ్లిచూపులు అనే కార్యక్రమం ద్వారా మొదటిసారిగా తెరపై సందడి చేసింది. అలాగే బుల్లితెర సీరియల్స్ ఇంటింటి గృహలక్ష్మి, కస్తూరి, అత్తారింటికి దారేది, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు.

ఇలా ఎన్నో సీరియల్స్‌ లో నటించిన షబీనా జబర్దస్త్ లో నటించడం వల్ల ఒక్కసారిగా ఈమె ఫేట్ మారిందని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా వరుస అవకాశాలు కూడా అందుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now