Ankitha : ఒక‌ప్ప‌టి ఎన్‌టీఆర్ హీరోయిన్‌.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Ankitha : ఎన్‌టీఆర్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహాద్రి మూవీ గుర్తుంది క‌దా. ఈ మూవీలో ఎన్టీఆర్ త‌న మాస్ విశ్వ రూపాన్ని చూపించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజయం సాధించి ఎన్‌టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇక ఈ మూవీలో భూమిక, అంకిత హీరోయిన్లుగా న‌టించారు. అయితే భూమిక సెకండ్ ఇన్నింగ్స్ త‌రువాత కూడా సినిమాల్లో న‌టిస్తోంది. కానీ అంకిత మాత్రం సినిమాల‌కు దూర‌మైంది. ఇక ఈమె ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. అన్న వివ‌రాల‌ను తెలుసుకుందాం.

అంకిత బాల‌న‌టిగా కూడా యాక్ట్ చేసింది. అప్ప‌ట్లో ఈమె ర‌స్నా యాడ్‌లో న‌టించి పాపుల‌ర్ అయింది. త‌రువాత కూడా ప‌లు యాడ్స్‌లోనూ న‌టించింది. అయితే హీరోయిన్‌గా తెలుగులోనే మొద‌టి చిత్రం చేసింది. అప్ప‌ట్లో వైవీఎస్ చౌద‌రి తెర‌కెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో ఈమె సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. దీంతో ఈమెకు సినిమాల్లో హీరోయిన్ అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి.

Ankitha

అలా హీరోయిన్ గా మారిన అంకిత‌కు ఎన్‌టీఆర్ స‌ర‌స‌న సింహాద్రిలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. ఈ మూవీ కూడా హిట్ కావ‌డంతో అంకిత‌కు ఆఫ‌ర్లు బాగానే వ‌చ్చాయి. త‌రువాత ఈమె స్టేట్ రౌడీ, విజ‌యేంద్ర వ‌ర్మ‌, సీతారాముడు, అన‌సూయ‌, వినాయ‌కుడు అనే మూవీలు చేసింది. అలాగే త‌మిళంలోనూ ప‌లు చిత్రాల్లో న‌టించింది. అప్ప‌ట్లో ఈమె అందాల‌ను ఆర‌బోయ‌డంలో అంద‌రిక‌న్నా ఒక మెట్టుపైనే ఉండేది. దీంతో ఈమెను చూసి కుర్ర‌కారు మైమ‌రిచిపోయేవారు.

ఇక త‌రువాత ఆమె చేసిన అనేక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె కెరీర్‌లో డౌన్ ఫాల్ మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే సినిమా అవ‌కాశాలు రాక‌పోయేస‌రికి ఈమె పూణెకు చెందిన వ్యాపార‌వేత్త విశాల్‌ను పెళ్లి చేసుకుంది. అక్క‌డే సెటిల్ అయిపోయింది. అలాగే త‌న తండ్రికి ఉన్న వ‌జ్రాల వ్యాపారాన్ని ప్ర‌స్తుతం ఈమె చూసుకుంటోంది. కానీ సినిమాల్లోకి వ‌స్తారా.. అని ఈ మ‌ధ్యే ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు ఆ ఉద్దేశం లేద‌ని క‌చ్చితంగా చెప్పేసింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇక ఏమీ ఎంట్రీ ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌మైంది. అయిన‌ప్ప‌టికీ వ్యాపారంలో మాత్రం బాగానే రాణిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM