యాంక‌ర్ సుమ పెళ్లి చీర ఖ‌రీదు ఎంతో తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

August 19, 2022 2:20 PM

రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ, ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరలోకి అడుగు పెట్టారు యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తుంటుంది సుమ. కెరీర్ ఆరంభంలో మాత్రం సుమ ఫేమ్ అవ్వడానికి చాలా కష్టపడిందనే చెప్పొచ్చు. అయితే సుమ ఎప్పుడైతే రాజీవ్ ను పెళ్ళి చేసుకుందో అప్పటి నుంచి సుమ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

కనకాల కుటుంబంలోకి సుమ వచ్చాక‌.. వెండితెర కు దూరంగా ఉండి బుల్లితెరపైనే ఫోకస్ పెట్టేసింది. అయితే సుమ పెళ్లి 1999లో జరిగిందన్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చాయి. సుమ తన యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఓ కొత్త వీడియోను అప్‌లోడ్‌ చేసింది. అందులో తన వరలక్ష్మీ వ్రతం చీర, తన తల్లి 80వ బర్త్ డేకు సంబంధించిన చీర షాపింగ్ గురించి ఉంది.

do you know about anchor suma marriage saree and its cost

ఆ వీడియోలో సుమ.. షింఘానియా అనే షాపింగ్ మాల్ ప్రాముఖ్యత, విశిష్టతను వివరించింది. అందులో పది వేల నుంచి పది లక్షల ఖరీదైన చీరలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. పదిహేను వేల రేంజులో చూపించు అని సరదాగా అంటే.. మీ రేంజ్ ఇది కాదు మేడం.. అంతా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయని సేల్స్ మేనేజర్ అంటాడు. నాది ఇదే రేంజ్ అండి.. అని సుమ సరదాగా అంటుంది.

ఇక ఓ పెళ్లీ చీరను చూపించి.. దీని రేటు రెండు లక్షలు అని చెబుతాడు. వామ్మో అనుకుంటూ.. రాజా మనం మళ్లీ పెళ్లి చేసుకుందామా ? రెండు లక్షలా.. మా పెళ్లి చీర రూ.11 వేలే.. అంతే పెట్టాం.. అలా అని మేం ఎప్పుడో పెళ్లి చేసుకోలేదండి.. ఈ మధ్యే చేసుకున్నామని కౌంటర్లు వేసింది సుమ. అలా సుమ త‌న పెళ్లి చీర విశేషాలు బయటకు వచ్చాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now