Sneha Reddy : బాబోయ్.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ధ‌రించిన కోటు ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

April 19, 2022 10:45 PM

Sneha Reddy : ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరోల భార్యలు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. వీరు షేర్ చేసే పోస్ట్‌లు ఒక్కోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సినిమాల్లో నటించకపోయినప్పటికీ.. స్నేహా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీగా ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా ఎనిమిది మిలియర్స్ కు అతి చేరువలో ఉంది. ఒక హీరో భార్యకు ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉండటం ఒక రికార్డు అనే చెప్పాలి.

do you know about Allu Arjun wife Sneha Reddy coat price
Sneha Reddy

అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితమే 40వ పుట్టినరోజు వేడుకల కోసం భార్య పిల్లలతో యూరోప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి అక్కడ ఆయన బ‌ర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దాని తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చ‌ల్ చేశాయి. ఫొటోలలో స్నేహా రెడ్డికి సంబంధించిన ఓ ఫొటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. అందుకు కారణం ఆ ఫొటోలో స్నేహా రెడ్డి లూయిస్ విట్టన్ కోటు ధరించ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఈ కోటు ధర రూ.5,09,311. అవును మీరు విన్నది నిజమే. ఈ డ్రెస్‌పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

బన్నీ మాదిరి స్నేహా కూడా మంచి ఫ్యాషన్ ఐకాన్. ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తులు ధరించి గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. కాగా బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఈయన పుష్ప ది రైజ్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప ది రూల్ రాబోతోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందులో రష్మిక మందన్న‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా అలరించబోతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now