Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం లభించాలంటే.. ఆమెను ఇలా పూజించాలి..!

January 31, 2023 3:47 PM

Lakshmi Devi : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం కోసం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో నిలవడం లేదని.. వృథాగా ఖర్చు అవుతుందని అంటుంటారు. అలాగే అనేక రకాల సమస్యలు చుట్టు ముడుతున్నాయని చెబుతుంటారు. ఇలాంటి వారందరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దీంతో ఆమె అనుగ్రహం వల్ల చేతిలో డబ్బు నిలుస్తుంది. ధనం బాగా సంపాదిస్తారు. ఇతర సమస్యలు కూడా పోతాయి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. ఆమె స్వరూపం అయిన తులసి దగ్గర రోజూ దీపం వెలిగించాలి. రోజూ ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి తులసి కోట దగ్గర పూజ చేయాలి. కనీసం ఒక దీపం లేదా అగరువత్తి వెలిగించి అయినా సరే మనసులో రోజూ ఒకే కోరికను కోరాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక తెల్లని వస్త్రాన్ని పూజ గదిలో నేలపై పరచాలి. దానిపై ధాన్యం పోయాలి. అనంతరం ఆ ధాన్యంపై అమ్మవారిని ప్రతిష్ట చేయాలి. అనంతరం ఆమెకు చామంతి పూలతో పూజ చేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేయాల్సి ఉంటుంది. దీంతో అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది. ధనం బాగా సంపాదిస్తారు.

do puja to Lakshmi Devi to get money and wealth
Lakshmi Devi

గులాబీలు, తామర పువ్వులు, మల్లె పువ్వులు, సన్నజాజులతో ఆమ్మవారిని పూజిస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది. మనపై అనుగ్రహం కలిగిస్తుంది. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు. అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. తరువాత ఆమెకు పూజ చేస్తూ అష్టోత్తరం చదవాలి. తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. దీంతో సిరి సంపదలు కలుగుతాయి. అనుకున్నవి నెరవేరుతాయి. లక్ష్మీ కటాక్షం కలిగి ధనం బాగా సంపాదిస్తారు. ఇలా ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు అమ్మవారిని పూజిస్తూ ఆమె కృపకు పాత్రులు కావచ్చు. ధనాన్ని సంపాదించవచ్చు. సమస్యల నుంచి బయట పడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now