DJ Tillu Movie Review : డీజే టిల్లు మూవీ రివ్యూ..!

February 12, 2022 12:07 PM

DJ Tillu Movie Review : సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించిన తాజా చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ శ‌నివారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ఎలా ఉంది ? డీజే టిల్లు ఆక‌ట్టుకున్నాడా ? లేదా ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

DJ Tillu Movie Review
DJ Tillu Movie Review

క‌థ‌..

డీజే టిల్లు అలియాస్ బాల గంగాధ‌ర్ తిల‌క్ (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌) ఫుల్ బిందాస్ హ్యాపీగా లైఫ్‌ను గ‌డుపుతుంటాడు. అత‌నికి రాధిక (నేహా శెట్టి) ప‌రిచ‌యం అవుతుంది. ఆమెతో అత‌ను ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే అంతా సాఫీగానే సాగుతోంది అనుకున్న క్ర‌మంలో రాధిక ఒక వ్య‌క్తిని హ‌త్య చేసిన కేసులో చిక్కుకుంటుంది. దీంతో ఆ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట ప‌డింది ? అందుకు డీజే టిల్లు ఏం చేశాడు ? అన్న‌దే.. డీజే టిల్లులోని మిగిలిన క‌థ‌.

న‌టీన‌టుల‌ పెర్ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ బాగానే పెర్ఫార్మెన్స్ చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు. సిద్ధు ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ ఆక‌ట్టుకుంటుంది. డైలాగ్ డెలివ‌రీ బాగుంటుంది. యూత్‌ను ఆక‌ర్షిస్తాడు. నేహా శెట్టి కూడా ఫ‌ర్వాలేద‌నిపించింది. ఇక ప్రిన్స్‌, బ్ర‌హ్మాజీ, ప్ర‌గ‌తి, న‌ర్రా శ్రీ‌నివాస్‌లు త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర బాగానే న‌టించారు.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీను నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటింగ్ నవీన్ నూలి చేశారు. ఈ క్ర‌మంలోనే చిత్ర నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకున్నాయి. అలాగే సంగీతం కూడా అదిరిపోయింది. విమల్ కృష్ణ దర్శకత్వం బాగుంది. దర్శకుడు చెప్పాల‌నుకున్న‌ది కామెడీ రూపంలో చెప్పాడు. క‌నుక మొత్తంగా చెప్పాలంటే.. ఈ మూవీ మంచి కామెడీని అందిస్తుంది. కామెంటీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కోరుకునే వారు ఈ మూవీని ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now