Disco Shanti : నయనతార దుస్తులపై డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు.. వాళ్ళ కాస్ట్యూమ్స్ వల్గర్ గా ఉంటాయి..

September 19, 2022 10:18 AM

Disco Shanti : డిస్కో శాంతి.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది డిస్కో శాంతి. 80ల‌లో డిస్కో శాంతి కోసం యువత థియటర్స్ వద్ద క్యూ కట్టే వారు అనడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు సిల్క్ స్మిత రాణిస్తున్న సమయంలోనే డిస్కో శాంతి తన మార్క్ డాన్స్ లతో అలరించి ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఆ తర్వాత ఆమె నటుడు శ్రీహరిని వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. గ్లామర్ కాస్ట్యూమ్స్ ధరించినంత మాత్రాన ఏ హీరోయిన్ పై నెగిటివ్ ఇమేజ్ పడదు. కానీ ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరిస్తున్నాం.. ఏవిధంగా ధరిస్తున్నాం.. మనకి అవి సూట్ అవుతున్నాయా లేదా అనే అంశాలే కీలకంగా ఉంటాయి. ఉదాహరణకి నయనతారని తీసుకుందాం. నయనతార ఎలాంటి కాస్ట్యూమ్స్ లో కనిపించినా అందంగా ఉంటుంది. ఆమె ఎంపిక అంత అద్భుతంగా ఉంటుంది అని డిస్కోశాంతి ప్రశంసించారు.

Disco Shanti sensational comments on nayanthara
Disco Shanti

కొంతమంది ఒంటి నిండా బట్టలు ధరిస్తారు. కానీ బిగుతుగా శరీరానికి అతుక్కునట్లు ఉండే కాస్ట్యూమ్స్ చాలా అగ్లీగా, వల్గర్ గా ఉంటాయి. బికినీ ధరించిన వారంతా అసభ్యంగా కనిపిస్తారు అని.. ఒంటినిండా బట్టలు కప్పుకున్న వారంతా అందంగా ఉంటారని అనుకోవడం తప్పు అని డిస్కో శాంతి అన్నారు. డిస్కో శాంతి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు డిస్కో శాంతి కామెంట్స్ తో ఏకీభవిస్తున్నారు. నయనతార డ్రెస్సింగ్ స్టైల్ డిస్కో శాంతికి బాగా నచ్చినట్టుందని చెప్పకనే చెప్పినట్టైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now