Dimple Hayathi : బాల‌కృష్ణ సినిమాకు నో చెప్పిన ఖిలాడి బ్యూటీ..?

May 18, 2022 8:35 AM

Dimple Hayathi : గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, శృతి హాస‌న్‌లు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న మూవీకి ఎన్‌బీకే107 అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను ఖ‌రారు చేసిన విష‌యం విదిత‌మే. ఈ మూవీకి అన్న‌గారు అనే టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఇక ఈ మూవీలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌గా.. సీనియ‌ర్ క్యారెక్ట‌ర్‌కు జోడీగా హ‌నీ రోజ్ వ‌ర్గీస్‌ను ఇటీవ‌లే ఎంపిక చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. ఇక ఈ మూవీలో ఐట‌మ్ సాంగ్ కోసం ఖిలాడి బ్యూటీ డింపుల్ హ‌య‌తిని అనుకున్నారు. కానీ ఈమె ఇందుకు నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఖిలాడి సినిమాలో న‌టించిన డింపుల్ హ‌య‌తికి న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే ప‌డ్డాయి. పైగా అందాల‌ను ఒక రేంజ్‌లో ఆర‌బోసింది. దీంతో ఆ మూవీ ఫ్లాప్ అయినా.. ఈమెకు ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దీంతో ఇక‌పై ఆమె ఐట‌మ్ సాంగ్స్ చేయొద్ద‌ని అనుకుంటుంద‌ట‌. దీని వ‌ల్లే ఆమె బాల‌కృష్ణ సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసేందుకు కూడా అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె నో చెప్ప‌డంతో ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఇంకో ఐట‌మ్ భామ కోసం చూస్తున్నార‌ని తెలుస్తోంది.

Dimple Hayathi reportedly said no to Balakrishna movie
Dimple Hayathi

ఇక ఎన్‌బీకే107 సినిమాలో ఐట‌మ్ సాంగ్ కోసం ఇండియ‌న్‌-ఆస్ట్రేలియ‌న్ మోడ‌ల్ చంద్రిక ర‌వి అనే కొత్త అమ్మాయిని తీసుకోవాల‌ని గోపీచంద్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో ట‌చ్‌లో ఉన్నారు. కానీ చివ‌రి నిమిషం వ‌ర‌కు డింపుల్ హ‌య‌తికే మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. కానీ డింపుల్ మాత్రం ఐట‌మ్ సాంగ్‌కు స‌సేమిరా.. అంటోంద‌ని స‌మాచారం. మ‌రి చివ‌రికి ఈ ఇద్ద‌రు భామ‌ల‌లో ఐట‌మ్ సాంగ్ కోసం ఎవ‌రు ఎంపిక అవుతారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now