Dil Raju : తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడో.. దానికి అస‌లు కార‌ణం ఏమిటో.. చెప్పేసిన దిల్ రాజు..

November 29, 2022 8:45 PM

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే. ఆయ‌న రెండో పెళ్లి 2020 డిసెంబర్ లో జరిగింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం అత్యంత సన్నిహితుల మధ్య ఆయ‌న వివాహం చేసుకున్నారు. 49 ఏళ్ల వయసులో దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో రాత్రి 11 గంటలకు ఆయ‌న‌ వివాహం చేసుకున్నారు. అయితే దిల్ రాజు రెండో పెళ్లి విష‌యం బయటకు రాగానే.. అటు ఇండస్ట్రీలోనూ బయటి జనంలో కూడా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువతి ఎవరు ? ఎందుకు చేసుకున్నారు అనే చ‌ర్చ‌లు ఎక్కువగా జ‌రిగాయి. అయితే తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వ‌చ్చిందో.. అందుకు కార‌ణాలు ఏమిటో.. దిల్ రాజు వివ‌రించారు.

ఓ టీవీ చాన‌ల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు త‌న రెండో పెళ్లి వెనుక ఉన్న అస‌లు కార‌ణాన్ని ఓపెన్ గా చెప్పేశారు. త‌న భార్య అనిత చ‌నిపోయాక తాను రెండేళ్ల పాటు ఒంట‌రిగా ఉన్నాన‌ని.. ఆమె మ‌ర‌ణించాక కుమార్తె, అల్లుడు త‌న ఇంట్లోనే ఉన్నార‌ని తెలిపారు. అయితే భార్య లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని తెలిపారు. తాను రోజంతా ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఇంటికి వ‌స్తే భార్య‌ను చూశాక మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని.. కానీ భార్య లేక‌పోవ‌డంతో త‌న‌కు ఏదో లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే త‌న కుమార్తె, స్నేహితులు, బంధువులు రెండో పెళ్లి చేసుకోవాల‌ని చెప్పార‌ని.. దాంతో అమ్మాయి కోసం వెదికాన‌ని అన్నారు.

Dil Raju told why he done second marriage
Dil Raju

అయితే కొంద‌రు అమ్మాయిల‌ను ప‌రిశీలించాక త‌న‌కు వైదా అయితే క‌రెక్ట్ అనిపించి ఆమెతో మాట్లాడాన‌ని.. అన్నీ చెప్పాన‌ని.. దీంతో ఆమె పెళ్లికి ఒప్పుకుంద‌ని అన్నారు. అందువ‌ల్లే తాము పెళ్లి చేసుకున్నామ‌ని త‌మకు కుమారుడు జ‌న్మించాడ‌ని అన్నారు. ఇక తన మొద‌టి భార్య అనిత‌, రెండో భార్య వైదా పేర్లు క‌ల‌సి వ‌చ్చేలా త‌న కొడుక్కి అన్వ‌య్ అని పేరు పెట్టామ‌ని వివరించారు. ప్ర‌స్తుతం అంతా హ్యాపీగా ఉంద‌న్నారు దిల్‌రాజు. అయితే దిల్ రాజు మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే మొదటి భార్య అనిత మ‌ర‌ణం వ‌ల్ల ఆయ‌న తీవ్రంగా కుంగి పోయిన‌ట్లు అర్థ‌మ‌వుతుందని.. ఆ బాధ నుంచి బ‌య‌ట ప‌డేందుకే ఆయన రెండో పెళ్లి చేసుకున్నార‌ని.. అర్థం అవుతుంద‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా దిల్ రాజు ఇచ్చిన ఆ ఇంట‌ర్వ్యూ మాత్రం వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now