Dil Raju : మాట త‌ప్పిన దిల్ రాజు.. ఎఫ్3 మూవీకి టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచారుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ మ‌ధ్యే టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేసిన విష‌యం విదిత‌మే. ఆయ‌న నిర్మించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానున్న నేప‌థ్యంలో.. ఈ సినిమాకు సాధార‌ణ టిక్కెట్ ధ‌ర‌ల‌నే వ‌సూలు చేస్తున్నామ‌ని.. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డం లేద‌ని చెప్పారు. కానీ ఆయ‌న మాట త‌ప్పిన‌ట్లు అర్థం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీకి గాను బుకింగ్స్‌ను ప్రారంభించ‌గా.. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచి విక్ర‌యిస్తున్నారు. ఒక్కో టిక్కెట్‌పై రూ.25 నుంచి రూ.45 వ‌ర‌కు పెంచారు.

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ఒక్క టిక్కెట్ కు రూ.150, మ‌ల్టీప్లెక్సుల్లో అయితే రూ.250 గా ఉంది. అయితే వీటి ధ‌ర‌ల‌ను రూ.25 నుంచి రూ.45 మేర పెంచారు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.175, మ‌ల్టీప్లెక్సుల‌లో ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.295గా ఉంది. వీటికి ట్యాక్స్‌లు అద‌నం. ఈ క్ర‌మంలోనే దిల్ రాజు త‌మ సినిమాకు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డం లేద‌ని చెప్పారు కానీ.. ఆయ‌న చెప్పిన మాట‌ను త‌ప్పార‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పెంచిన ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నారు.

Dil Raju

ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం త‌మ సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం లేద‌ని.. సాధార‌ణ ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నామ‌ని దిల్ రాజు ఇటీవ‌ల చెప్పారు. అలాగే ఎఫ్3 మూవీకి గాను పోస్ట‌ర్‌ల‌పై కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌చారం చేశారు. సాధార‌ణ ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నామ‌ని.. అంద‌రూ సినిమాను చూడాల‌ని పోస్ట‌ర్స్ రిలీజ్ చేశారు. కానీ చివ‌ర‌కు సీన్ రివ‌ర్స్ చేశారు. టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచారు. ఈ క్ర‌మంలో ఫ్యామిలీ ఆడియెన్స్ అంత ఖ‌ర్చు పెట్టి ఈ మూవీని చూస్తారా.. అన్న సందేహం క‌లుగుతోంది. భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన రాధే శ్యామ్, ఆచార్య‌, స‌ర్కారు వారి పాట వంటి చిత్రాల‌కే తొలి రోజు థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగా క‌నిపించాయి. ఇక ఎఫ్3 మూవీకి కూడా టిక్కెట్ల‌ను పెంచారు. ఇది చిన్న సినిమా. స్టార్స్ ఉన్న‌ప్ప‌టికీ బ‌డ్జెట్ త‌క్కువే. మ‌రి ఈ సినిమాకు తొలి రోజు థియేట‌ర్ల‌లో ఎలాంటి ప‌రిస్థితి ఉంటుంది ? అన్న విష‌యం వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM