Naga Chaithanya : సమంత కన్నా ముందు నాగ చైతన్య ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా ?

November 25, 2021 11:22 AM

Naga Chaithanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న వారిలో అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఒకటని చెప్పవచ్చు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని అనంతరం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా సాగిపోయిన వీరి వైవాహిక జీవితానికి ఇటీవలే ముగింపు పలికారు.

did Naga Chaithanya tried to marry that actress before samantha

ఇలా వీరిద్దరూ విడిపోతున్నట్లు వెల్లడించి ప్రస్తుతం ఎవరి కెరియర్ పరంగా వారు ఎంతో బిజీగా ఉన్నారు. అయితే నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకోక ముందు మరో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని భావించాడని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీరి ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లలేదనే చెప్పాలి. ఇక నాగచైతన్య ఏ హీరోయిన్ ను ప్రేమించాడనే విషయానికి వస్తే..

నాగచైతన్య సీనియర్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ను ప్రేమించాడని వార్తలు వచ్చాయి. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు. వీరిద్దరూ కలిసి నటించిన ప్రేమమ్ సినిమా ద్వారా వీరి మధ్య రిలేషన్ ఏర్పడిందని, కానీ ఆ రిలేషన్ ఎక్కువకాలం నిలబడలేదని తెలుస్తోంది. శృతిహాసన్ తో తన లవ్ సక్సెస్ కాకపోవడంతో నాగచైతన్య అనంతరం సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే శృతి హాసన్‌ ను లవ్‌ చేసిన మాట నిజమో కాదో తెలియదు కానీ ఒకవేళ చేసి ఉంటే మాత్రం చైతూకు రెండో లవ్‌ కూడా ఫెయిలైనట్లే. సమంతకు అతను దూరం అయ్యాడు కనుక.. చైతూకు లవ్‌ అచ్చి రావడం లేదని అనుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now